Kalavakuntla Kavitha Tweet: ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ.. గెలుస్తామనే ఆశలు ఉన్నప్పటికీ.. గులాబీ పార్టీకి క్షేత్రస్థాయిలో వ్యతిరేక ఫలితం ఎదురయింది. సాక్షాత్తు గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్ని బాధ్యతలు తన భుజాల మీదికి ఎత్తుకొని ప్రచారం చేసినప్పటికీ.. మీడియాను, సోషల్ మీడియాను మేనేజ్ చేసినప్పటికీ గెలుపు దక్కలేదు. గులాబీ పార్టీకి కంచుకోట లాంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చరిత్ర లో ఎన్నడు లేనివిధంగా భారీ మెజారిటీతో విజయం సాధించారు.
గులాబీ పార్టీ ఓడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు.. తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ గులాబీ పార్టీని మరింత ఇబ్బంది పెడుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో సాధించిన విజయాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీభవన్లో సంబరాలు జరుపుకుంటున్నారు. టపాసులు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.. బీహార్ రాష్ట్రంలో ఓటమి ఎదురైన నేపథ్యంలో కొంతమంది నాయకులు సైలెంట్ గా ఉన్నప్పటికీ.. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాత్రం ఆనందంతో తాండవం చేస్తున్నారు. వాస్తవానికి ఈ గెలుపు ఊహించిందే అయినప్పటికీ.. భారీ మెజారిటీ రావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ప్రచారంలో పదేపదే కాంగ్రెస్ నాయకులు తామ మెజారిటీ కోసం మాత్రమే పనిచేస్తున్నామని చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాన్ని కార్యకర్తలు గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఈ జాబితాలోకి కేసీఆర్ కుటుంబ సభ్యురాలు కూడా చేరిపోయారు. అదేంటి కెసిఆర్ కుటుంబంలోని వ్యక్తి కాంగ్రెస్ పార్టీ సంబరాలలో భాగస్వామి కావడం ఏంటనే ప్రశ్న మీలో వ్యక్తం కావచ్చు. కానీ ఆ ప్రశ్నకు ఈ కథనం చదివితే మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది.
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత.. ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకోవడంలో ఒక అర్థం ఉంది. కానీ కెసిఆర్ కుమార్తె కవిత సోషల్ మీడియాలో విభిన్నంగా స్పందించారు. గులాబీ పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో తన ట్విట్టర్ ఖాతాలో కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ కర్మ సిద్ధాంతం ఎవరికి వర్తిస్తుంది? ఎవరు కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నారు? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు మీడియా సంస్థలకు కేటీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా కవితను ఉద్దేశించి ఎదురైన ప్రశ్నకు మొహమాటం లేకుండా సమాధానం చెప్పారు. పార్టీ విధివిధానాలకు లోబడి ఎవరైనా పనిచేయాలని.. పార్టీ గీత దాటితే పనిష్మెంట్ ఉంటుందని.. కవిత విషయంలో పార్టీ నిర్ణయాన్ని ఎప్పుడో చెప్పిందని పేర్కొన్నారు..
వాస్తవానికి ఈ సమాధానాన్ని తన సోదరుడి నుంచి కవిత ఊహించి ఉండదు. అందువల్లే జూబ్లీహిల్స్ కారు పార్టీ ఓడిపోయిన తర్వాత కర్మ హిట్స్ బ్యాక్ అనే ట్వీట్ ను కవిత చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హరీష్ రావు అంతగా కనిపించలేదు. కెసిఆర్ బయటకు రాలేదు. కేటీఆర్ మాత్రమే అన్ని తానై వ్యవహరించారు. అందువల్లే కవిత ఈ ట్వీట్ చేశారని తెలుస్తోంది. పైగా తనను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేయడం వెనుక తన సోదరుడు ఉన్నాడని కవిత బలంగా నమ్ముతున్నారు. అందువల్లే తన ఆగ్రహాన్ని ఈ రూపంలో బయటపెట్టారని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కవిత చేసిన ట్వీట్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ చేస్తున్నారు.
Karma hits back !!!
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 14, 2025