Drone taxi in Andhra Pradesh: విశాఖలో( Visakhapatnam) పెట్టుబడుల సదస్సు ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతోంది. ఉదయం 10:30 గంటలకు ప్రారంభం అయింది ఈ సదస్సు. రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది. రేపు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై ఐదు గంటల వరకు కొనసాగు నుండి ఈ సదస్సు. భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ సైతం పాల్గొన్నారు. ఏపీ పెట్టుబడులకు గేట్ వేగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సదస్సుకు 72 దేశాల నుంచి 52 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 2500 మంది పారిశ్రామికవేత్తలు సైతం పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలోనే డ్రోన్ టాక్సీలను ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం సాంకేతిక రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఈ క్రమంలోనే ఏరో స్పేస్, డ్రోన్, డిఫెన్స్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
– డ్రోన్ సిటీ ప్రకటన..
అయితే అందరి చూపు ఇప్పుడు విశాఖ సదస్సుపై ఉంది. చంద్రబాబు నోటి నుంచి డ్రోన్ టాక్సీ అనే మాట రావడంతో ఇప్పుడు దానిపైనే చర్చ మొదలయింది. డ్రోన్ టాక్సీ అనేది ఓ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్. అది రిమోట్ గా లేదా స్వయంగా పనిచేస్తుంది. డ్రోన్ టాక్సీ సాయంతో ప్రయాణికులను, సరుకులను రవాణా చేస్తుంటారు. డ్రోన్ టాక్సీని ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ లాండింగ్ వెహికల్ అని పిలుస్తుంటారు. రవాణాకు వేగవంతమైన, సమర్థవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందించేందుకు ప్రపంచంలోని పలు దేశాలు ఎదురుచూసాయి. ఈ డ్రోన్ టాక్సీలను అభివృద్ధి చేస్తున్నాయి.
– డ్రోన్ టాక్సీలు హెలికాప్టర్ల మాదిరిగానే పనిచేస్తాయి. అయితే ఎక్కువ దూరం ప్రయాణించవు. పైలట్ లేకుండానే తక్కువ దూరం ప్రయాణాలకు ఇవి అనుకూలంగా ఉంటాయి. ప్రయాణికులకు ఒకచోట నుంచి మరొకచోటకు వేగంగా తీసుకెళ్లేందుకు మాత్రం దోహదం చేస్తాయి. ఇవి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు కూడా తీరుతాయి.
– అయితే సీఎం చంద్రబాబు ప్రకటనే కాదు. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శుక్రవారం పెట్టుబడుల సదస్సు వేదికగా శంకుస్థాపన కూడా చేశారు. కర్నూలు జిల్లా వార్వకల్లులో డ్రోన్ సిటీని నిర్మించనున్నారు. మొత్తం 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ నిర్మాణం జరగనుంది. ఓర్వకల్లు డ్రోన్ సిటీలో టెస్టింగ్ సర్టిఫికేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు.
– ఇక్కడ 25 వేల మందికి శిక్షణ ఇచ్చేలా సౌకర్యం కల్పిస్తారు.
– మరోవైపు తిరుపతి, శ్రీ సత్య సాయి జిల్లాలో స్పేస్ సిటీ ఏర్పాటు కానుంది. పది సంవత్సరాల్లో 25 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా. 35 వేల మందికి ఉపాధి కూడా లభించనుంది.