BRS Defaming : బీఆర్‌ఎస్.. అలియాస్ టీఆర్‌ఎస్.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా పుట్టిన పార్టీ. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రొఫెసర్ జయశంకర్‌తోపాటు అనేక మంది తెలంగాణ ఉద్యమకారుల సలహాలు, సూచనలతో టీఆర్‌ఎస్‌ను స్థాపించారు. తెలంగాణ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సబ్బండ వర్గాలను ఏకం చేశారు. 13 ఏళ్ల పోరాటం తర్వాత ప్రత్యేక రాష్ట్రం సాధించారు. ఇది కేసీఆర్ ఒక్కరితోనే సాధ్యం కాలేదు. అనేక ప్రాణత్యాగాలు, పోరాటాలు, ఇతర త్యాగాల ఫలితంగా సాధ్యమైంది. కానీ క్రెడిట్‌ను కేసీఆర్ తన ఖతాలో వేసుకున్నారు. ఆ అహంకారంతోనే కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్, కూతురు కవిత, అల్లుడు హరీశ్‌రావును ఎవరైనా విమర్శిస్తే తెలంగాణను విమర్శించినట్లు ప్రచారం చేసుకుంటారు. సెంటుమెంటును రగిలిస్తారు. ఇక్కడ బాధాకరం ఏమిటంటే రాష్ట్రం సిద్ధించి 11 ఏళ్లు అయినా ఇప్పటికీ సెంటిమెంటుతోనే ఆ పార్టీ నాయకులు పబ్బం గుడుపుకుంటున్నారు.
బీఆర్‌ఎస్‌పై దాడి.. తెలంగాణపై దాడిగా..
బీఆర్‌ఎస్ నేతలు తమ నాయకత్వంపై వచ్చే విమర్శలను తెలంగాణ రాష్ట్ర గుర్తింపుపై దాడిగా చిత్రీకరించడం ద్వారా ఒక స్థిరమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ విధానం, అధికారవాద రాజకీయాలకు సాధారణమైనది, బాధ్యతాయుతత్వాన్ని తప్పించడానికి, విమర్శకులను నిశ్శబ్దం చేయడానికి ఉపయోగపడుతుంది. తాజాగా బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆంధ్రజ్యోతి పత్రికను ‘తెలంగాణ జ్యోతి‘గా పేరు మార్చాలని డిమాండ్ చేయడం ఈ వ్యూహానికి ఒక స్పష్టమైన ఉదాహరణ. అయితే ఈ డిమాండ్ ఇప్పుడు అందరికీ నవ్వు తెప్పిస్తోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఏర్పడిన పార్టీ.. తెలంగాణ పదం తొలగించుకుని భారత రాష్ట్ర సమతిగా మారింది. అయినా తెలంగాణ వాదాన్ని సెంటిమెంటును ప్రజల్లో రగిలించే ప్రయత్న చేస్తోంది.
Also Read: రాంచంద్రరావు దమ్ముంటే ఈ పని చేయి.. రాజాసింగ్ సవాల్ వైరల్
తెలంగాణ ప్రజలకు ఆపాదిస్తూ..
బీఆర్‌ఎస్ నాయకత్వంపై వచ్చే విమర్శలు, ఆరోపణలను తెలంగాణ ప్రజలకు ఆపాదించడం బీఆర్‌ఎస్ నాయకులకు మొదటి నుంచి అలవాటైంది. . ఎన్నికల సమయంలో, కవిత లిక్కర్ స్కాంలో అరెస్టు అయినప్పుడు తెలంగాణను అవమానించినట్లు ప్రచారం చేశారు. తాజాగా కేటీఆర్‌పై ఆంధ్రజ్యోతి పత్రికలో కథనం ప్రచురించగానే తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా కథనం రాసినట్లు ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ చిత్రీకరిస్తూ, భావోద్వేగ రాజకీయాలను తమ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అవి మీడియా సంస్థను తెలంగాణ గుర్తింపుకు వ్యతిరేకంగా నిలబెట్టే ప్రయత్నంగా కనిపిస్తాయి.
పార్టీ పేరు రీబ్రాండింగ్..
బీఆర్‌ఎస్ రీబ్రాండింగ్ నిర్ణయం తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్చడం, తమ గుర్తింపు రాజకీయాలలోని వైరుధ్యాన్ని బహిర్గతం చేస్తుంది. ‘తెలంగాణ‘ అనే పదాన్ని తమ పేరు నుంచి తొలగించడం ద్వారా, బీఆర్‌ఎస్ తమ రాజకీయ లక్ష్యాలను జాతీయ స్థాయికి విస్తరించాలని భావించింది. అయితే, ఇదే సమయంలో, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలు తమ పేరులో ‘తెలంగాణ‘ను చేర్చాలని డిమాండ్ చేయడం ద్వంద్వ నీతిని సూచిస్తుంది. ఈ వైరుధ్యం, బీఆర్‌ఎస్ తమ సొంత చర్యలకు ఒక ప్రమాణాన్ని, ఇతరులకు మరొక ప్రమాణాన్ని వర్తింపజేస్తుందని స్పష్టం చేస్తుంది.
ఐపీఎస్‌గా పనిచేసి..
ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ ఐపీఎస్‌గా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన విధులు నిర్వహించారు. తెలంగాణలో తక్కువ కాలం పనిచేశారు. తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని బీఎస్పీలో చేరారు. తర్వాత బీఆర్‌ఎస్‌తో చేతులు కలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి రీబ్రాండ్ అయిన తర్వాతనే ప్రవీణ్ ఆ పార్టీలో చేరారు. కానీ కేసీఆర్‌ను తెలంగాణ పదం ఎందుకు తొలగించలేదని ఏనాడు ప్రశ్నించలేదు. కానీ ఆంధ్రా మూలాలు ఉన్న వ్యక్తులు ఆరోపిస్తే మాత్రం బీఆర్‌ఎస్ నేతలపై విమర్శలు చేస్తే సెంటిమెంట్ రగిలిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు ఆపాదిస్తున్నారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా, చర్చను విషయసారం నుంచి దారి మళ్లిస్తుంది. ఆంధ్రజ్యోతి పేరు మార్పు డిమాండ్, పత్రిక కంటెంట్ లేదా రిపోర్టింగ్‌పై చర్చకు బదులుగా, గుర్తింపు రాజకీయాలపై దృష్టిని మళ్లిస్తుంది. ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ ఐపీఎస్‌గా చేసి తెలంగాణ వాదంపై మాట్లాడడం విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి వారితో పార్టీకి కూడా నష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
