BRS Phone Tapping Allegations:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నట్లు ఆరోపణలు
ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వ్యూహం
రాష్ట్ర వ్యాపితంగా దుమారం లేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బిఆర్ఎస్ వ్యూహాత్మకంగా ప్రభుత్వంపై ఎదురుదాడికి సిద్ధమైంది.
ఇక విచారణకు పెద్ద తలకాయలు
విచారణ వేగవంతమయ్యే దిశలో ప్రధాన నాయకులను కూడా విచారణకు హాజరుకావాలని పిలిచే అవకాశాలున్న ఈ సందర్భంలో పెద్ద తలకాయలు విచారణకు పిలిచే ముందే ఎదురుదాడికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా హుజురాబాద్ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం, ఈ విషయంలో నాయకులు పోటాపోటీగా విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకు కారణాలు ఏమై ఉంటాయని చర్చ జరుగుతోంది.
Also Read: ఆస్కార్.. భాస్కర్.. ఆ ఒక్క మాటతో రేవంత్ ను ఆడుకున్న కేటీఆర్
ఆర్ఎస్పీ ఏమంటున్నారు.?
ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కూడా సిట్ వాగ్మూలం ఇవ్వాలని పిలిచింది. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలోని ఇద్దరు నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఒక పత్రికలో వచ్చిన వార్త కథనం బట్టి తెలుస్తోందని మొదట ఆరోపించారు. ఈ విషయమై ఒక చానల్ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పు కాదని, అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు వట్టి ట్రాష్ అని కొట్టిపారేశారు. తన ఫోన్ ను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తున్నట్లు గతంలో ప్రవీణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన ఫోన్ రాజ్యం చేసిందని, అది కేంద్ర ప్రభుత్వం చేసిందో, రాష్ట్ర ప్రభుత్వం చేసిందో తెలుసుకోవలసిన బాధ్యత పోలీసులదేనని ఆయన సమర్థించుకున్నారు. “ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఏ ముఖ్యమంత్రి పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులను కోరారని, ప్రత్యేకించి కేసీఆర్ అసలే అడగరు..” అని చెప్పి స్వామి భక్తి ప్రదర్శించారు. ఒకవేళ చెప్పినా పోలీసులు ఆ పని చేయడం తప్పని కూడా ఆయన అన్నారు. ఏకంగా సీఎంపై విమర్శల డోసు పెంచినట్లు తెలుస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపుతున్నాయి. సీఎం ప్రైవేట్ హ్యాకర్ల తో హీరోయిన్ల ఫోన్లను హ్యాకింగ్ చేసినట్లు ఆరోపించడంతో రగడకు దారితీసింది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ శ్రేణులు రగిలిపోతూ, కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అధికారికంగా అనుమతులు తీసుకొని ప్రభుత్వం
ట్యాపింగ్ చేయడం తప్పుకాదని ముఖ్యమంత్రి డిల్లీలో ఒక చిట్ చాట్ లో ప్రస్తావించడాన్ని కూడా బిఆర్ఎస్ నాయకులు హైలైట్ చేస్తూ, ట్యాపింగ్ కేసు పెట్టీ ఇంత రాద్దాంతం చేయడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం పరిస్తితులకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ట్యాపింగ్ కు పాల్పడితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే విచారణకు సహకరించాల్సిన బాధ్యత గల నేతలు ఈ విషయంలో ఏదోవిధంగా తప్పించుకోవాలనే ప్రయత్నాలలో భాగంగా ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.