BRS BJP Clash: రాజకీయ నాయకులకు స్వీయ ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. పార్టీలకు సొంత ఆకాంక్షలు మాత్రమే ఉంటాయి. ఆ ప్రయోజనాల కోసం, ఆకాంక్షల కోసం రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఎలాగైనా వ్యవహరిస్తాయి. ఎంత దూరమైనా ప్రయాణిస్తాయి. దానికోసం ఎలాంటి పనులైనా చేపడతాయి. అందువల్లే అప్పటిదాకా విమర్శలు చేసుకున్నవారు ఒకరి భుజాల మీద మరొకరు చేతులు వేసుకొని స్నేహితులైపోతారు. అప్పటిదాకా తిట్టుకున్న నాయకులు ఒకరిని ఒకరు ప్రశంసించుకుంటూ ముందుకు వెళ్తుంటారు.. అందుకే రాజకీయమనేది పరమపద సోపానానికి మించిన క్రీడ. ఇందులో నీతి న్యాయానికి ఆస్కారం లేదు.
Also Read: చదువతూ సంపాదించే ఛాన్స్.. అస్సలు మిస్ చేసుకోకండి..!
తెలుగు రాష్ట్రాలలో నిన్నటి నుంచి విలీనం, పొత్తు అనే మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. ఇప్పట్లో ఎన్నికలు లేవు. ఎన్నికలు జరిగే అవకాశాలూ లేవు. అయిప్పటికీ పొత్తులు, విలీనం అంశాలు చర్చకు వస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ నాయకులే. ఇటీవల ఓ సమావేశంలో భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు.. కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టిన వ్యవహారంలో.. ఫ్యూచర్ సిటీలో కాంట్రాక్టు ఇచ్చే విషయంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడి పై సీఎం కేసీఆర్ ఉదారత చూపించారని.. ఏకంగా ₹1,650 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ కంపెనీకి అప్పగించారని భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు ఆరోపించారు.
భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు ఆరోపణలు చేసిన తర్వాత.. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ స్పందించారు. ” కవిత జైల్లో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితిని విలీనం చేస్తానని చెప్పలేదా. కేటీఆర్ ఇదే విషయాన్ని నా ఎదుట ప్రస్తావించారు. అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించకుంటే.. మా పార్టీని బిజెపిలో విలీనం చేస్తాం. లేకుంటే పొత్తు కుదుర్చుకుంటామని నా ఎదుట కేటీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇదే విషయాన్ని మా పార్టీ పెద్దలతో చెప్తే వారు వద్దన్నారు. ఇది అబద్ధం కాదు కదా. నాడు కేటీఆర్ నన్ను ఢిల్లీలో మీట్ అయినప్పుడు.. సిసి ఫుటేజ్ రికార్డులు నా వద్ద ఉన్నాయి. అవసరమైతే మీడియా సమక్షంలో బయటపెడతాను” సీఎం రమేష్ వ్యాఖ్యానించారు.. సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారాయి. సీఎం రమేష్ వ్యాఖ్యలను భారత రాష్ట్ర సమితి నాయకులు వ్యతిరేకిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు.
Also Read: జగన్, న్యాయవాదులు పంకిలమైపోయారు సరే.. తమరి మాటేమిటి ఆర్కే సార్!
సీఎం రమేష్ మాటలను కాస్త పక్కన పెడితే.. గతంలో కవిత జైలుకు వెళ్ళినప్పుడు గులాబీ, కమలం పార్టీల మధ్య పొత్తు ప్రస్తావన వచ్చింది. ఇదే విషయాన్ని కవిత కూడా ఇటీవల చెప్పింది.. కాకపోతే పొత్తు లేదా విలీనానికి తాను ఒప్పుకోలేదని.. కవిత చెప్పడం విశేషం. సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపట్ల అంతెత్తున ఎగిరి పడుతున్న భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు.. గతంలో కవిత చేసిన వ్యాఖ్యల పట్ల సైలెంట్ గా ఉన్నారు. అలాంటప్పుడు పొత్తు, విలీనం చర్చలు జరిగింది వాస్తవమే కదా. ఇన్ని ప్రచారాల మధ్య కేటీఆర్ ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.