Kingdom Trailer Review: విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న కింగ్ డమ్ (Kingdom) సినిమా ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను నిన్న రాత్రి రిలీజ్ చేశారు. మొత్తానికైతే సినిమా ట్రైలర్ ను భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశారు. ఇక దాంతోపాటు సినిమా ప్లాట్ పాయింటు ఏంటో కూడా రివిల్ చేశారు. విజయ్ ఒక పోలీస్ ఆఫీసర్ అయినప్పటికి తను అండర్ కవర్ ఆపరేషన్ చేయాల్సి వస్తోంది. అందులో భాగంగానే అతను జైలుకు వెళ్లి జైల్లో ఉన్న సత్యదేవ్ ను కలవాల్సి వస్తుంది. అక్కడ రౌడీలందరికి హెడ్డుగా ఉన్న సత్యదేవ్ ని విజయ్ దేవరకొండ చంపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరి ఇలాంటి సందర్భంలోనే సత్యదేవ్ తన అన్నయ్య అని తెలుసుకున్న విజయ్ దేవరకొండ తనని ఎలాగైనా సరే మంచిగా మార్చి తనకు ఉన్న శత్రువులన చంపేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా మొత్తం ఒక ప్యూర్ ఎమోషన్ తో సాగబోతోంది.
బ్రదర్స్ సెంటిమెంట్ తో వస్తె ప్రేక్షకులను ఈజీగా కనెక్ట్ చేయవచ్చు అనే ఒక ఉద్దేశ్యంతో గౌతం ఈ కథను రాసుకున్నాడు. కానీ ఇప్పటి వరకు చాలా సినిమాలు బ్రదర్స్ సెంటిమెంట్ తో తెరకెక్కాయి. మరి వాటన్నింటిని బీట్ చేస్తూ ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తోంది అనేది ఇక్కడ పెద్ద సమస్య గా మారింది…విజువల్స్ రిచ్ గా కనిపిస్తున్నప్పటికీ కథ సినిమాకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే మాటలు వినిపిస్తున్నాయి…మరి ఏది ఏమైనప్పటికి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతుంది.ఇక అనిరుధ్ బిజియం సూపర్ గా ఉండటంతో ట్రైలర్ లో ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. గత కొన్ని రోజుల నుంచి వరుసగా ప్లాప్ సినిమాలు చేస్తున్న విజయ్ ‘కింగ్ డమ్’ సినిమాతో సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు.
అయితే కింగ్డమ్ ట్రైలర్లో సినిమా ప్లాట్ పాయింట్ మొత్తాన్ని రివిల్ చేసినప్పటికి ట్రైలర్ మాత్రం చాలా ఆసక్తికరంగా కట్ చేశారనే చెప్పాలి.దాంతో పాటుగా ట్రైలర్లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను కూడా రివిల్ చేశారు. ఇక అదే కాకుండా ఒక ట్రైబల్ ఏరియా కి విజయ్ వెళ్లి అక్కడ ఉన్న మనుషులతో కలిసి పోలీస్ ఆఫీసర్ గా ఉన్నతను ఆ ఏరియాకి లీడర్ గా మారబోతున్నాడు అనేది కూడా తెలుస్తోంది…
విజయ్ ఎందుకు ఆ ఏరియాకి లీడర్ల మారాల్సి వచ్చింది. ఆ ట్రైబల్ ఏరియా కి రాజకీయ నాయకుల నుంచి పోలీస్ ఆఫీసర్ నుంచి ఎటువంటి ఒత్తిడి వస్తుంది.ఆయన ప్రజలకు హెల్ప్ గా ఉన్నాడా లేదంటే సత్యదేవ్ కోసం అలా చేస్తున్నాడా? సత్యదేవ్ తన అన్న అయినప్పటికి ఎందుకని ఆయన రాంగ్ రూట్లో వెళ్లాల్సి వచ్చింది. విజయ్ తనను గాడిలో పెడతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
