HomeతెలంగాణAmbedkar Open University: చదువతూ సంపాదించే ఛాన్స్‌.. అస్సలు మిస్‌ చేసుకోకండి..!

Ambedkar Open University: చదువతూ సంపాదించే ఛాన్స్‌.. అస్సలు మిస్‌ చేసుకోకండి..!

Ambedkar Open University: చదువుతూ సంపాదించడం.. ఇది వినడానికే బాగుంది కదా.. ఇలాంటివి సాధారణంగా విదేశాల్లో ఉంటాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకేలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన చాలా మంది విద్యార్థులు అక్కడి ఖర్చుల కోసం పార్ట్‌టైం జాబ్‌ చేస్తుంటారు. అయితే ఇటీవల అ అవకాశాన్ని కూడా తగ్గిస్తున్నాయి. అయితే ఇలాంటి అవకాశమే మన దేశంలో ఉంటే.. ఎగిరి గంతేస్తాం కదా.. ఆ సమయం రానే వచ్చింది. అదీ మన తెలంగాణలోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటిసారి డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనిర్సిటీ చదువుకుంటూ సంపాదించుకునే అవకాశం ఇస్తోంది. ఈ చొరవ ద్వారా విద్యార్థులు అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా నెలకు రూ.7 వేల నుంచి రూ.24 వేలు సంపాదించవచ్చు. ఈ కార్యక్రమం విద్యా, ఆర్థిక సామర్థ్యాలను ఒకేసారి పెంచే లక్ష్యంతో రూపొందించబడింది.

Also Read:  జాగృతి లీడర్.. కవిత అడుగులు దేన్ని సూచిస్తున్నాయి..

వినూత్న ఆలోచన..
అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ రిటైలర్స్‌ అసోసియేషన్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతో భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ చొరవ విద్యార్థులకు అకడమిక్‌ లక్ష్యాలతోపాటు ఆర్థిక స్వావలంబనను అందించడంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. సంప్రదాయ విద్యా విధానంలో చదువుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వగా, ఈ కార్యక్రమం ఆర్థిక స్థిరత్వం, వృత్తిపరమైన నైపుణ్యాలను కూడా పెంపొందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ విధానం ద్వారా విద్యార్థులు ఆర్థిక భారం లేకుండా తమ చదువును కొనసాగించవచ్చు.

వీరు అర్హులు..
ఈ కార్యక్రమంలో భాగంగా, 18 నుంచి 27 ఏళ్లలోపు విద్యార్థులు అప్రెంటిస్‌షిప్‌లో చేరే అవకాశం ఉంది. వారు నెలకు రూ.7 వేల నుంచి రూ.24 వేల వరకు సంపాదించవచ్చు. ఇది వారి నైపుణ్యాలు, పని రకంపై ఆధారపడి ఉంటుంది. ఈ కార్యక్రమంలో చేరాలనుకునే వారు యూనివర్సిటీ అందించిన నంబర్లు (040–23680333/555) ద్వారా సంప్రదించవచ్చు. ఈ పథకం విద్యార్థులకు ఆర్థిక సహాయంతోపాటు రిటైల్‌ రంగంలో వృత్తిపరమైన నైపుణ్యాలను అందిస్తుంది.. ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది. చాలా మంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది. ఈ పథకం ద్వారా వారు తమ చదువును కొనసాగిస్తూనే ఆర్థిక స్థిరత్వాన్ని పొందవచ్చు. అంతేకాకుండా, రిటైల్‌ రంగంలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడం వల్ల విద్యార్థులు ఉద్యోగ మార్కెట్‌లో మరింత ఆకర్షణీయంగా మారతారు.

Also Read:  సీఎం రమేశ్‌ను కేటీఆర్‌ ఎందుకు టార్గెట్‌ చేశారు?

ఈ కార్యక్రమం విద్యార్థులకు ఆర్థిక, వృత్తిపరమైన ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, దీని అమలులో కొన్ని సవాళ్లు ఉన్నాయి. అప్రెంటిస్‌షిప్‌లో పాల్గొనే విద్యార్థులు చదువుకు, పనికి సమతుల్యతను కాపాడుకోవాలి. అదనంగా, ఈ కార్యక్రమం విజయం రిటైలర్స్‌ అసోసియేషన్‌తో సమన్వయం, అప్రెంటిస్‌షిప్‌ అవకాశాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. కార్యక్రమం విజయం దీర్ఘకాలంలో దేశంలోని ఇతర విద్యా సంస్థలకు ఒక ఆదర్శంగా నిలుస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version