Hydra: మూసీ ప్రక్షాళనకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లో ఆక్రమణలను హైడ్రాతో కూల్చివేయిస్తున్న రేవంత్‌రెడ్డి.. మూసీ ప్రకక్షాళనలో భాగంగా ఇప్పుడు బుల్డోజర్లను మూసీవైపు రప్పించాలని భావించారు. ఈమేరకు ఆక్రమణల గుర్తింపు పనులు చేపట్టారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ఇళ్లకు మార్కింగ్ చేస్తున్నారు. అయితే దీంతో ఆందోళనకు గురైన బాధతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. బాధితుల ఆక్రందనలపై మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. మరోవైపు హైడ్రా దూకుడుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈతరుణంలో మూసీ ఆక్రమణల కూల్చివేతపై రేవంత్‌రెడ్డి కూల్ ప్లాన్ వేశారు. నిర్వాసితులను ఖాళీ చేయించే విషయంలో దూకుడు వద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. డబుల బెడ్రూంకు తరలించే సమయంలో కూడా బాధితులపై ఆగ్రహం వ్యక్తం చేయొద్దని, నచ్చజెప్పి పంపించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ సమయంలో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేసినా ఓపిక పట్టాలని సూచించారని తెలుస్తోంది. మరోవైపు హైడ్రా దూకుడుపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము స్టే ఇచ్చిన నిర్మాణాలు కూల్చడం లేంటని ప్రశ్నించింది. ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టడంపై మందలించింది.
రెక్కలు ముక్కలు చేసుకుని..
మూసీ పరీవాహక ప్రాంతంలో ఇళ్లు కట్టుకున్నవారిలో చాలా మంది పేదలే. రూపాయి రూపాయి పోగు చేసుకుని, కూలీనాలు చేసుకుని ఇళ్లు నిర్మించుకున్నారు. ఇప్పుడు వాటిని తొలగిస్తామనడంతో ఆందోళన చెందుతుఆన్నరు. రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను బీఆర్‌ఎస్ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బీఆర్‌ఎస్ అనుకూల మీడియా వీటినే ఎక్కువగా హైలేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం ప్లాన్ మార్చినట్లు తెలుస్తోంది. మూసీ పరీవాహక ప్రాంతంలో కూల్చివేతలపై దూకుడు వద్దని ఆదేశించారని సమాచారం. దీంతో హైడ్రా బుల్డోజర్లు స్పీడు తగ్గించినట్లు తెలుస్తోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతంలో అలజడి తగ్గింది. అందరిని బుజ్జగించి ఖాళీ చేయించాలని రేవంత్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
భారీగా ఖరీదు..
ఇదిలా ఉంటే.. మూసీ పరీవాహక ప్రాంతంలో ఒక్కో ఇల్లు రూ.50 లక్షల నుంచి రూ.కోటి పలుకుతోంది. దీంతో ఆ ఇళ్లను విడిచి వెళ్లుందుకు కొందరు ఆసక్తి చూపడం లేదు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రనతిపక్ష నేతల సాయం కోరుతున్నారు. బీఆర్‌ఎస్ కూడా దీనిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలోనే ప్రభుత్వం మూసీ పరీవాహక ప్రాంత ప్రజల తరలింపు కోసం కూల్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.