Boring Guda Village Unknown Facts: వర్షాకాలం ఎటు చూసినా నీరే కనిపిస్తుంది. చెరువులు, కుంటలు నిండి ఉండడంతో బావుల్లోకి కూడా పుష్కలంగా నీరు వస్తుంది. అదే వేసవి కాలంలో అయితే ఎక్కడా చుక్క నీరు కనిపించదు. ముఖ్యంగా గ్రామాల్లో అయితే నీటి కోసం అల్లాడిపోతారు. అయితే ఓ గ్రామంలో మాత్రం నీరు ఉబికి వస్తూ ఉంటుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 సంవత్సరాలుగా ఆ గ్రామంలో నిరంతర నీటి ప్రవాహం సాగుతూనే ఉంటుంది. అయితే ఈ గ్రామంలో నీటి సౌకర్యం కోసం బోరింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ బోరింగ్ ద్వారా కొట్టకుండానే నీరు రావడం విశేషం. ఇలా ఉబికి వస్తున్న ఆ గ్రామం ఎక్కడ ఉందో తెలుసా?
ఆదిలాబాద్ కు అడవుల జిల్లాగా పేరు ఉంది. చుట్టూ పచ్చని వాతావరణంతో ఇక్కడి గ్రామాలు ఉంటాయి. ముఖ్యంగా అదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా ఆదివాసీలు నివసిస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా అడవుల్లోనే జీవిస్తారు. అయితే ఆదిలాబాద్ మండలంలోని బోరింగ్ గ్రామం ఉంది. ఈ గ్రామంలో బోరింగ్ నుంచి నిత్యం నీరు వస్తూనే ఉంటుంది. అందుకే దీనిని బోరింగ్ గ్రామం గా పిలుస్తున్నారు. బోరింగ్ వాడ గ్రామంలో 300 మంది ప్రజలు జీవిస్తున్నారు. వీరికి ఈ బోరింగ్ నీరే ఆధారం. అయితే ఈ నీరు రావడానికి గల కారణమేంటి అని అడగగా.. హైడ్రాలిక్ ప్రెషర్ అని అంటున్నారు.
హైడ్రాలిక్ ప్రెషర్ సిస్టంలో ఒక పంపు ద్వారా ద్రవం పీడనానికి గురవుతుంది. ఈ పీడనం వల్ల లోపల ఉండే మీరు ఒక గొట్టం ద్వారా ప్రయాణించి బయటకు వస్తుంది. హైడ్రాలిక్ సిస్టంను ఎక్కువగా పెద్దపెద్ద వస్తువులను కదిలించడానికి ఉపయోగిస్తారు. హైడ్రాలిక్ ప్రెషర్ సిస్టంతో బ్రేకులు, లిఫ్టులు పనిచేస్తాయి. పాస్కల్ నియమం ప్రకారం ఒక సంపీడనం చెందని ద్రవంలో ఏదైనా పాయింట్ పై ప్రయోగించిన పీడనం, ఆ ద్రవం ద్వారా అన్ని దిశలలోనూ ఏమాత్రం తగ్గకుండా ప్రసారం చేయబడుతుంది.
Also Read: హరీష్ రావు లేని లోటు సుస్పష్టం
బోరింగ్ వాడ గ్రామంలో కూడా అదే జరుగుతోంది. ఇక్కడ భూమి లోపల ద్రవ పీడనం వల్ల నీరు ఆటోమేటిగ్గా పైకి వస్తున్నాయి. అయితే సమీప ప్రాంతాల్లో నీరు ఎక్కువగా ఉండడంతోనే ఇలా జరుగుతుందని కొందరు అంటున్నారు. వాస్తవానికి ఈ గ్రామం మారుమూల ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతానికి వెళ్లాలంటే కూడా కష్టమే అవుతుంది. కానీ ఇక్కడ నీరు సమృద్ధిగా ఉండడంతో ఇక్కడి ప్రజలు నీటి కొరత లేకుండా జీవిస్తున్నారు. వేసవికాలంలోనూ నీరు సమృద్ధిగా ఉండడంతో హాయిగా ఉంటున్నారు. అలాగే ఇక్కడ పంటలు కూడా సమృద్ధిగా పండుతున్నాయి. సాధారణంగా ఆదిలాబాద్ జిల్లాలో వేసవికాలంలో నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. కానీ బోరింగ్ వాడ గ్రామం సమీపంలో మాత్రం నీటి కొరత లేకుండా ఉంటుంది.