Major Diseases Causing Deaths: పుట్టే ప్రతి మనిషి గిట్టక మానడు అని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. పుట్టుక చావుల మధ్య ఉన్న జీవితం సంతోషంగా ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. అంతేకాకుండా పూర్తికాలం జీవించాలని అనుకుంటారు. నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు అనేక రకాల ప్రయోగాలు చేస్తుంటారు. నాణ్యమైన ఆహారం, వ్యాయామం, ఒత్తిడికి దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ కాలుష్యంతో చాలామంది పూర్తి కాలం జీవితం గడపడం లేదు. 50 ఏళ్లు కూడా నిండకుండానే చాలామంది ప్రాణాలు విడిస్తున్నారు. ఇందుకు కారణం ఏంటి అని భారత రిజిస్టర్ జనరల్ ఆధ్వర్యంలో మోడల్ రిజిస్ట్రేషన్ సర్వే నిర్వహించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
2001- 2003 సంవత్సరాల మధ్య మోడల్ రిజిస్ట్రేషన్ సర్వే సమర్పించిన నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధిక మరణాలకు నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులే కారణమని తెలిపింది. అంటే గుండె జబ్బుల వ్యాధులతోనే 31 శాతం మరణిస్తున్నారని పేర్కొంది. అలాగే 9.3 శాతం శ్వాస సంబంధిత వ్యాధులు, 6.4% ప్రాణాంతక వ్యాధులు, 5.7% ఇతర వ్యాధుల కారణంగా చనిపోతున్నారు. అలాగే పోషకాహారం లోపం వల్ల 23.4% మరణిస్తున్నారని నివేదిక తెలుపుతోంది. కోవిడ్ సమయంలో 55.7% మరణాలు సంభవించాయని తెలిపింది.
గుండెజబ్బులతో మరణించేవారు 29 నుంచి 30 ఏళ్ల వయసు వారే ఎక్కువగా ఉన్నారని.. వారి జీవన శైలి తో ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారని. ఫలితంగా ఈ వ్యాధికి గురై మరణిస్తున్నారని పేర్కొంది. 30 ఏళ్లు రాగానే చాలామంది కెరీర్ పై ఎక్కువగా దృష్టి పెడతారు. ఇదే సమయంలో వివాహం విషయంలో తీవ్ర ఆందోళన చెందుతారు. అప్పటికి ఒక పొజిషన్లో ఉంటే.. ఈ సమయంలోనే వివాహం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. పెళ్లయిన తర్వాత కుటుంబ పోషణ.. ఇతర ఆర్థిక పరిస్థితుల కారణంగా తీవ్రవత్తిడికి గురై మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొంటున్నారు. ఇక 5.3% జీర్ణకోశ వ్యాధులతో మరణిస్తున్నారని అంటున్నారు. అంటే వీరు చిరుతిళ్లు, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటూ అనారోగ్యాల బారిన పడుతున్నారని. అందుకే ఈ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. 3.7% ప్రమాదాల పారిన పడుతున్నట్లు నివేదిక సమర్పించారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. డ్రైవింగ్పై అవగాహన లేని చాలామంది వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. 3.5% డయాబెటిస్ మిల్లీటస్ కారణంగా ప్రాణాలు పోతున్నాయని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతుంది. అయితే వీరిలో కొంతమంది ఆరోగ్యం పై పరిరక్షణ లేకపోవడంతో పాటు.. డయాబెటిస్ వ్యాధిపై అవగాహన లేక ఆహార నియమాలు పాటించడం లేదు. దీంతో ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది.