BJP MP Raghunandan Rao ఇన్నాళ్లపాటు తన వాగ్దాటితో.. ప్రత్యర్థులను ముప్పు తిప్పులు పెట్టే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మెదక్ పార్లమెంటు సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడ్డారు. ఓ భూ వివాదాన్ని గులాబీ సోషల్ మీడియా తెరపైకి తీసుకువచ్చింది.
వివాదాన్ని గులాబీ పార్టీకి అనుకూలంగా పనిచేసే సోషల్ మీడియా సంస్థ రఘునందన్ రావు ప్రమేయం ఉందన్నట్టుగా భూముల వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చింది. భారత రాష్ట్ర సమితికి అనుకూలంగా పనిచేసే ఆ సోషల్ మీడియా ఎక్స్ ఫోజ్ చేసిన వివరాల ప్రకారం.. 84 ఎకరాల భూమిని రఘునందన్ రావు అక్రమంగా కొట్టేసారట. ఆ భూములు మొత్తం కూడా అసైన్డ్ వట. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రఘునందన్ రావు అక్రమంగా ఈ భూములను తన పేరు, మన కుటుంబ సభ్యుల పేరు మీద చేయించుకున్నారట. దుబ్బాక నియోజకవర్గం లోని అక్బర్ పేట్ – భూమ్ పల్లి మండలం చౌదర్ పల్లి గ్రామంలోని వడ్డెర, దళిత కుటుంబాలకు సంబంధించిన 84 ఎకరాల లావుణి భూమి ఉన్నది. ఇది అసైన్ రకానికి చెందినది. అయితే ఈ భూములను రఘునందన్ రావు కొనుగోలు చేసినట్టు భారత రాష్ట్ర సమితి ఆరోపిస్తోంది. ఆ ఆరోపణలకు తగ్గట్టుగానే.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా తెరపైకి కీలకమైన ఆధారాలను తీసుకొచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూమిని రఘునందన్ రావు క్లియర్ పట్టా చేయించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూభారతిలో అసైన్డ్ భూములు పట్టాగా మార్చుకునే అవకాశం ఉందని.. అందువల్లే రఘునందన్ రావుకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారని భారత రాష్ట్ర సమితి ఆరోపిస్తోంది.
84 ఎకరాల చుట్టూ..
84 ఎకరాల చుట్టూ రఘునందన్ రావు కంచె వేశారట. అక్కడికి ఎవరూ వెళ్లకుండా బౌన్సర్లతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారట.. దీనిపై వట్టెం రామకృష్ణ అనే న్యాయవాది కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో ఈ భూముల బాగోతం బయటికి వచ్చిందని భారత రాష్ట్ర సమితి ఆరోపిస్తోంది…ఈ వ్యవహారం బయట పెడితే మీడియా సంస్థలకు నోటీసులు పంపిస్తున్నారని.. కేసులు వేసి బెదిరిస్తామని రఘునందన్ రావు భయపెడుతున్నారని భారత రాష్ట్ర సమితి ఆరోపిస్తోంది. ఇక ఇటీవల కేటీఆర్ కూడా పేరు ప్రస్తావించకుండా రఘునందన్ రావు పై ఆరోపణలు చేశారు. భూములు తన పేరు, కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆయన ఆరోపించిన తర్వాత ఇంతవరకు ఆ పార్టీ ఒక్క ఆధారం కూడా బయట పెట్టలేదు. కానీ అనూహ్యంగా రామకృష్ణ అనే న్యాయవాది ఈ వివరాలను బయట పెట్టడంతో.. ఇదేదో తమకృషి వల్లే అన్నట్టుగా భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా విభాగం తెగ ప్రచారం చేసుకుంటున్నది. అంతేకాదు ఆ భూములపై డ్రోన్ ద్వారా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో తెగ పోస్ట్ చేస్తున్నది. అయితే 84 ఎకరాల భూమిని రఘునందన్ రావు, ఆయన భార్య మంజుల, కూతురు సింధు పేరు మీద చేయించారని భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా విభాగం ఆరోపిస్తోంది. త్వరలోనే మరిన్ని వివరాలు బయటపెడతామని చెబుతోంది. అయితే రాజకీయ దుగ్ద తో నేరుగా రఘునందన్ రావు పై ఆరోపణలు చేస్తోంది. అంతేకాదు రఘునందన్ రావు వివరణ లేకుండానే ఏకపక్షంగా ఆరోపణలు చేస్తుంది. అయితే రఘునందన్ రావు మాత్రం లీగల్ నోటీసులు పంపిస్తూ.. సదరు సంస్థలపై పరువు నష్టం దావా వేస్తున్నట్టు చెబుతున్నారు.. చూడాలి మరి ఈ భూముల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో? అన్నట్టు ఈ భూములను తమ ఇష్టానుసారంగా అమ్మినట్టు అక్కడి రైతులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఇందులో వివాదం ఏముందో అర్థం కావడం లేదని బిజెపి నాయకులు అంటున్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చొదర్పల్లి గ్రామంలో (దుబ్బాక) లావుణి పట్టా భూములను క్లియర్ చేయించుకున్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు https://t.co/lcKITZHIew pic.twitter.com/VP6KxJaYoI
— Telugu Scribe (@TeluguScribe) May 16, 2025