CM Chandrababu : ఆంధ్ర ప్రదేశ్ లో ఉండే మహిళలు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం(Free Bus Scheme For Women) పథకం అమలు అవుతుందా లేదా అనే సందేహాలకు ఇక తెరపడినట్టే. ఆగష్టు 15 నుండి ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారిక ప్రకటన చేసాడు. కూటమి అధికారం లోకి వచ్చే ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో అత్యంత కీలకమైన హామీ ఇది. ఈ పథకాన్ని అమలు చేయలేదని విపక్ష పార్టీ వైసీపీ తన మీడియా ఛానల్ లో ఎలా ప్రచారం చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఈ పథకం లో ఒక షరతు ఉంది. కేవలం జిల్లాల పరిధి లో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లేందుకు మాత్రమే ఈ పథకం అమలు అవుతుంది. ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి కానీ, లేదా ఒక జిల్లా నుండి మరో జిల్లాకు కానీ వర్తించదు.
Also Read :మహానాడులో సంచలనాలు.. లోకేష్ కు పట్టాభిషేకం.. కరెక్ట్ సమయం అంటున్న క్యాడర్!
ఇది ఎన్నికలలో హామీ ఇచ్చినప్పుడు చంద్రబాబు(CM Chandrababu Naidu) గట్టిగా చెప్పలేదు కానీ, ఒక సభలో మాత్రం ఈ విషయాన్నీ స్పష్టంగా చెప్తాడు. రెండు నెలల క్రితం జరిగిన శాసనమండలి సమావేశాల్లో కూడా మంత్రి ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశాయి. చూడాలి మరి సీఎం ఈ అంశంపై ఎలాంటి క్లారిటీ ఇస్తాడు అనేది. ఇదంతా పక్కన పెడితే కూటమి పార్టీ అధికారం లోకి వచ్చే ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ప్రధానమైనవి ‘తల్లికి వందనం’, ‘అన్నదాత సుఖీభవ’. ఈ రెండు హామీలను కూడా జూన్ 12 వ తేదీన నెరవేర్చబోతున్నట్టు తెలుస్తుంది. ప్రతీ ఏడాది జూన్ 12 న ఈ పథకం అమలు కానుంది. ఇప్పటికే ప్రతీ గ్రామం లోనూ, పట్టణం లోనూ రోడ్లు నిర్మిస్తుండడం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండడం పై జనాలు కూటమి ప్రభుత్వం పై మంచి అభిప్రాయం తో ఉన్నారు.
మరో పక్క పెట్టుబడులు భారీగా వస్తున్నాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు మరో రెండు మూడు ఏళ్లలో మన ఆంధ్ర ప్రదేశ్ లో కొలువుదీరబోతున్నాయి. అమరావతి రాజధాని పనులు చకచకా జరుగుతున్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపించడం, ప్రతీ నెల 4 వేల రూపాయిల పెన్షన్ ఇవ్వడం, మత్యకారులకు 20 వేల రూపాయిల ఉపాధి, దివ్యంగులకు 15 వేల రూపాయల పెన్షన్, ఇలా ఒక పక్క అభివృద్ధి, మరో పక్క ఇచ్చిన ప్రతీ మాటని నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడాన్ని చూస్తుంటే మంచి ప్రభుత్వం అనే ప్రచారం నిజం అవ్వబోతుంది అన్నమాట అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.