https://oktelugu.com/

BJP Manifesto: పది అంశాలు.. పది లక్షల ఉద్యోగాలు… ఇదీ బీజేపీ మేనిఫెస్టో!

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. చేపట్టబోయే 10 అంశాలకు సంబంధించిన కార్యాచరణను మేనిఫెస్టోలో పొందుపరిచింది.

Written By: , Updated On : November 19, 2023 / 01:29 PM IST
BJP Manifesto

BJP Manifesto

Follow us on

BJP Manifesto: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు అన్ని విభాగాల్లో వెనుకబడిన బీజేపీ ఇప్పుడు మేనిఫెస్టోను కూడా అన్ని పార్టీల కంటే ఆఖరున విడుదల చేసింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. చేపట్టబోయే 10 అంశాలకు సంబంధించిన కార్యాచరణను మేనిఫెస్టోలో పొందుపరిచింది. సకలజనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టోను కేంద్ర మంత్రి అమిత్‌ షా ప్రకటించారు.

సకల జనుల సౌభాగ్య..
బీజేపీ అధికారంలోకి వస్తే.. ప్రజలందరికీ సుపరిపాలన, సమర్థవంతమైన పాలనపై దృష్టి పెట్టనున్నట్టు అమిత్‌ షా తెలిపారు. అవినీతిని ఉక్కుపాతంతో అణచివేయటంతోపాటు ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా.. సబ్‌ కా సాత్, సబ్‌ కా వికాస్‌… సబ్‌ కా విశ్వాస్, సబ్‌ కా ప్రయాస్‌.. నినాదంతో పాలన సాగిస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే.. మేనిఫెస్టోలోని 10 అంశాలకు సంబంధించిన కార్యాచరణను అమిత్‌ షా ప్రకటించారు.

మహిళలకు పది లక్షల ఉద్యోగాలు..
తాము అధికారంలోకి వస్తే మహిళలకు పెద్ద పీట వేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా దశల వరీగా మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. పది లక్షల మంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని పేర్కొన్నారు.

ప్రధాన అంశాలు..
రైతే రాజు– అన్నదాతలకు అందలం
విద్యాశ్రీ– నాణ్యమైన విద్య
ప్రజలందరికీ సుపరిపాలన– సమర్థవంతమైన పాలన
యువశక్తి–ఉపాధి
వారసత్వం–సంస్కృతి చరిత్ర
సంపూర్ణ వికాసం– పరిశ్రమలు, మౌలిక వసతులు
నారీశక్తి– మహిళల నేతృత్వంలో అభివృద్ధి
వైద్యశ్రీ– నాణ్యమైన వైద్యసంరక్షణ
వెనుకబడిన వర్గాల సాధికారికత– అందరికీ చట్టం సమానంగా వర్తింపు
కూడు–గూడు ఆహార నివాస భద్రత

మేనిపేస్టో కొన్ని ముఖ్య అంశాలు
1. ధరణి స్థానంలో ‘మీ భూమి’ యాప్‌.
2. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ.
3. గల్ఫ్‌ బాధితుల కోసం నోడల్‌ ఏజెన్సీ.
4. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్‌.
5. 4 శాతం ముస్లిం రిజర్వేషన్‌ ఎత్తివేత.
6. సబ్సిడీపై విత్తనాలుం వరిపై బోనస్‌.
7. ఆడబిడ్డ భరోసా పథకం కింద 21 యేళ్లు వచ్చే సరికి 2 లక్షల రూపాయలు.
8. ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా నాలుగు సిలిండర్లు.
9. మహిళ రైతు కార్పొరేషన్‌ ఏర్పాటు.
10. ఫీజుల నియంత్రణ నిరంతర పర్యవేక్షణ.
11. బడ్జెట్‌ స్కూల్స్‌ కు పన్ను మనిహాయింపులు.
12. ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ లు.
13. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణ
14. ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ల ఏర్పాటు..
15. పీఆర్సీపై రివ్యూం ప్రతి 5 సంవత్సరాలకు ఓ సారి ్కపీఆర్సీ
16. జీఓ 317 పై పునసమీక్ష
17. గల్ఫ్‌ దేశాల్లో తెలంగాణ భవన్లు
18. 5 ఏళ్లకు లక్ష కోట్లతో బీసీ అభివద్ది నిధి
19. రోహింగ్యాలు, అక్రమ వలస దారులను పంపించేస్తాం
20. తెలంగాణలో ఉమ్మడి పౌర స్మతి అమలు చేస్తాం
21. అన్ని పంటలకు పంట బీమాం బీమా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది.
22. 5 ఏళ్లలో మహిళలకి ప్రభుత్వ ప్రైవేట్‌ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు
23. వృదులకు కాశీ, అయోధ్య కు ఉచిత ప్రయాణం .