HomeతెలంగాణMaheswara Reddy: ఇదీ బీజేపీ మాట.. తెలంగాణ సీఎం మార్పు ఖాయమట

Maheswara Reddy: ఇదీ బీజేపీ మాట.. తెలంగాణ సీఎం మార్పు ఖాయమట

Maheswara Reddy: తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మూడేళ్లు అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్‌ గతంలో ఎన్నడూ లేనంత ఊపు తెచ్చారు. ఉప ఎన్నికల్లో ఇద్దరిని ఎమ్మెల్యేగా గెలిపించారు. సీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 43 కార్పొరేట్‌ స్థానాలు దక్కేలా చేశారు. గ్రామస్థాయికి పార్టీని తీసుకెళ్లారు. ఒకప్పుడు బీజేపీ అంటే అర్బన్‌ పార్టీ మాత్రమే అనే అభిప్రాయం ఉండేది. నేత విషయానికి వస్తే దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి లాంటి కొది మంది నేతల పేర్లు మాత్రమే వినిపించేవి. కానీ బండి సంజయ్‌ అధ్యక్షుడు అయ్యాక అనేక మంది నేతలు వెలుగులోకి వచ్చారు. ఇతర పార్టీల నేతలు కూడా బీజేపీలోకి క్యూ కట్టారు. ఇక బీజేపీకి ఓ రేంజ్‌లో మైలేజ్‌ వచ్చింది. అయితే అధిష్టానం అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో సంజయ్‌ను తప్పించింది. దీంతో క్యాడర్‌ మొత్తం డీలా పడింది. తర్వాత కిషన్‌రెడ్డి సారథ్యంలో ఎన్నికలకు వెళ్లింది. అయినా బీజేపీ గతంలో ఎన్నడూ లేని విధంగా 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీ స్థానాలు గెలుచుకుంది.

పార్టీ పరువు తీస్తున్నారు..
అయితే ఇప్పుడు బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు, వ్యాఖ్యలు ఆ పార్టీ పరువు తీస్తున్నాయి. రాజకీయం చేయాలి కాబట్టి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఆ పార్టీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. వారి మాటలకు పొంతన ఉండదు. ఇలాంటి నేతలకు ఇప్పుడు మహేశ్వర్‌రెడ్డి కూడా తోడయ్యారు. బీజేఎల్పీ నేతగా ఆయన నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు. సభలో ఆయన మాట తీరుకుడా విషయ పరిజ్ఞానం ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఆయన చేసే ప్రకటనలు, వ్యాఖ్యలు, ఆరోపణలు బీజేపీనే ఇరుకున పడేస్తున్నాయి. తాజాగా రేవంత్‌రెడ్డిపై పుకార్లు రేపుతున్నారు. సీఎంకు కాంగ్రెస్‌ అగ్రనేతలు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లదని ఆరోపిస్తున్నారు. 2025 జూన్‌ నుంచి డిసెంబర్‌ మధ్య సీఎంను మారుస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు సీఎం రేసులో ఉన్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఏ కోశానా నమ్మదగినట్లుగా లేవు.

గాలి మాటలే..
బీజేఎల్పీ చేస్తున్న ఆరోపణలన్నీ గాలి మాటలే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో చేసిన ఆరోపణల ఆధారంగా ఈ నిర్ణయానికి వస్తున్నారు. పొంతన లేని ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటుగా మారింది. బీజేఎస్పీ నేత పదవిలో ఉన్నానని, ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుందనే అభిప్రాయంలో ఉన్నారు. కానీ, తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సొంత పార్టీపై అవగాహన లేని ఆయన.. కాంగ్రెస్‌ నుంచి మాత్రం తనకు కచ్చితమైన సమాచారం ఉందటూ వ్యాఖ్యానించడం చర్చనీయంశంగా మారింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular