హుజూరాబాద్, బద్వేల్ ఉపఎన్నికల షెడ్యూల్ ను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అక్టోబర్ 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న కౌంటింగ్ నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల షెడ్యూల్ ను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. హుజురాబాద్, బద్వేల్ రెండు స్థానాల్లో బైపోల్స్ జరగనుండగా.. ఇందుకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 1న విడుదల కానుంది.

అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అలాగే అక్టోబర్ 11న నామినేషన్ల ను పరిశీలిస్తారు. నామినేషన్ల చివరి తేదీ అక్టోబర్ 13గా ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. బైపోల్స్ పోలింగ్ తేదీ అక్టోబర్ 30గా ప్రకటించింది. నవంబర్ 2వ తేదీన కౌంటింగ్ జరగనుంది.
నవంబర్ 2న కౌంటింగ్ పూర్తి కాగానే ఫలితాలను వెల్లడిస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూల్ ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు, మూడు లోక్ సభ స్థానాలకు ఈ ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.