Canada: విదేశాల్లో భారతీయులు, భారత సంతతి యువకుల హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు ఆగడం లేదు. తాజాగా కెనడాలో భారత సంతతి యువకుడు హత్యకు గురయ్యాడు. జూన్ 7న(శుక్రవారం) అతడిపై దుండగులు కాల్పులు జరిపి చంపేశారని పోలీసులు తెలిపారు. మృతుడు భారత సంతతికి చెందిన యువరాజ్ గోయల్‌గా గుర్తించారు. బ్రిటిష్ కోలంబియాలోని సర్రేలో ఈ హత్య జరిగింది. పోలీసులకు సమాచారం అందటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే యువరాజ్ గోయల్ మృతి చెంది ఉన్నాడు.
నలుగురి అరెస్ట్..
యువరాజ్ హత్య కేసులో పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న నలుగురిని అరెస్టు చేశారు. మన్వీబాస్రామ్(23), సాహిబ్ బాస్రా(20), హర్కిరత్ ఝుట్టీ(23), ఓంటారియోకు చెందిన కీలాన్ ఫ్రాంకాయిస్(20) ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. యువరాజ్‌పై ఎలాంటి క్రైం రికార్డు లేదని పోలీసులు తెలిపారు. అతి దగ్గరి నుంచి కాల్చడంతో యువరాజ్ చనిపోయినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ హత్యకు కారణాలు ఏమై ఉంటాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పంజాబ్ యువకుడు..
ఇదిలా ఉండగా పంజాబ్‌లోని లూథియానాకు చెందిన యువరాజ్ 2019లో కెనడా వెళ్లాడు. అక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. యువరాజ్ తండ్రి రాజేశ్ గోయెల్ ఫైర్వుడ్ వ్యాపారం చేస్తున్నారు. యువరాజ్ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.