HomeతెలంగాణBetting Apps Case: బెట్టింగ్‌ యాప్‌ల కేసులో కొత్త మలుపు.. ఇక సిట్‌ వంతు!

Betting Apps Case: బెట్టింగ్‌ యాప్‌ల కేసులో కొత్త మలుపు.. ఇక సిట్‌ వంతు!

Betting Apps Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన బెట్టింగ్‌ యాప్‌ల కేసు రోజుకో మలుపు తిరిగుతోంది. మొదటగా ఈ యాప్‌లు ప్రమోట్‌ చేసిన 25 మంది యాంకర్స్, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత విచారణకు పిలిచారు. ఆ తర్వాత 30 యాప్‌ల నిర్వాహకులపై కేసులు పెట్టారు. ప్రమోటర్లన సాక్షులుగా మార్చారు. ఇప్పుడు ఇదే కేసును ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది.

Also Read: మల్లారెడ్డి సార్.. ఈ వయసులో ఈ కసి వ్యాఖ్యలేంటి సార్!

తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌(Online Betting aaps)లపై కఠిన చర్యలు తీసుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)కి అప్పగించాలని నిర్ణయించింది. ఈ విషయం హైదరాబాద్‌లోని సెషన్స్‌ కోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. ఈ కేసులు గతంలో పంజాగుట్ట(Panja gutta), మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లలో నమోదైనప్పటికీ, ఇప్పుడు వీటిని SIT ద్వారా లోతుగా విచారించనున్నారు. ఈ బెట్టింగ్‌ యాప్‌ల వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ, ఇటువంటి అక్రమ కార్యకలాపాలను కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, IPS అధికారి సాజనార్‌ ఈ కేసులపై తీవ్రంగా పనిచేస్తున్నారు. సోషల్‌ మీడియా ప్రముఖులతో పాటు సినీ తారలైన విజయ్‌ దేవరకొండ, రానా దగ్గుబాటిలపై కూడా ఈ కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసులన్నీ ఇప్పుడు SIT పరిధిలోకి వెళ్లడంతో దర్యాప్తు కొత్త దిశగా సాగనుంది.

హీరోల తరఫున వాదన..
విజయ్‌ దేవరకొండ(Vijay devarakonda), రానా(Rana) తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ తమ వాదనను వినిపించారు. వారు చేసిన ప్రకటనలు చాలా సంవత్సరాల క్రితం జరిగినవని, ప్రస్తుతం అవి ఎక్కడా కనిపించడం లేదని చెప్పారు. అంతేకాదు, తమను నిర్దోషులుగా నిరూపించుకోవడానికి తగిన చట్టపరమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వారు స్పష్టం చేశారు. ఈ పరిస్థితిలో SITఈ కేసులను ఎలా నిర్వహిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఈ కేసుల్లో అక్రమ బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం చేసిన సోషల్‌ మీడియా(Social Media)ప్రముఖులు ప్రధానంగా నిఘాలోకి రానున్నారు. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government)ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉంది. ఈ దర్యాప్తు ఫలితాలు బెట్టింగ్‌ యాప్‌ల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తాయని ఆశిస్తున్నారు. SIT ఈ కేసులను ఎలా ముందుకు తీసుకెళుతుంది, ఎవరెవరు బాధ్యులుగా నిర్ధారణ అవుతారనేది త్వరలోనే తేలనుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version