https://oktelugu.com/

Barrelakka : పెళ్ళైన నెలకే భర్తపై బర్రెలక్క షాకింగ్ కామెంట్స్… నేను ఇష్టపడలేదంటూ బాంబు పేల్చిన సోషల్ మీడియా స్టార్!

కానీ ఆ తర్వాత కొన్ని కష్టమైన పరిస్థితుల్లో వెంకటేష్ నాకు చాలా సపోర్ట్ చేశాడు. కొంతకాలం తర్వాత పెద్దలు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. ఒకరంటే మరొకరికి ఇష్టం ఉండటంతో పెళ్లిచేసుకున్నామని చెప్పకొచ్చింది బర్రెలక్క.

Written By:
  • NARESH
  • , Updated On : April 30, 2024 / 08:51 PM IST

    Barrelakka

    Follow us on

    Barrelakka : సోషల్ మీడియా స్టార్ బర్రెలక్క ఇటీవల వెంకటేష్ అనే అబ్బాయి ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బర్రెలక్క భర్తపై ఊహించని కామెంట్స్ చేసింది. వెంకటేష్ అంటే ఇష్టం ఉండేది కాదని చెప్పి షాక్ ఇచ్చింది. కర్నె శిరీష అనే తెలంగాణ అమ్మాయి డిగ్రీ చదివింది. ఉద్యోగాలు లేక బర్రెలు కాసుకుంటున్నా అంటూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టింది. అవి కాస్తా వైరల్ కావడంతో బర్రెలక్క గా పాప్యులర్ అయ్యింది.

    2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారింది. నగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. అందరి దృష్టిని ఆకర్షించింది. ఎలక్షన్స్ లో ఓడిపోయినప్పటికీ ప్రజల్లో, యూత్ లో బర్రెలక్క మంచి ప్రభావం అయితే చూపించగలిగింది. ఆ తర్వాత కాస్త సైలెంట్ అయిన శిరీష .. పెళ్లి వార్తలతో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.

    బర్రెలక్క ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ షూట్, పెళ్లి వీడియోలు బాగానే వైరల్ అయ్యాయి. వివాహం అనంతరం ఓ ఇంటర్వ్యూలో శిరీష తన భర్త వెంకటేష్ ని ఉద్దేశిస్తూ కీలక కామెంట్స్ చేసింది. బర్రెలక్క మాట్లాడుతూ .. మొదట్లో వెంకటేష్ అంటే అస్సలు నచ్చేవాడు కాదు. అతను నాకు ఇంటర్ చదువుతున్నప్పుడు పరిచయం అయ్యాడు. ఇద్దరం కలిసి నాగర్ కర్నూల్ లో ఓ ప్రైవేట్ కాలేజ్ లో చదువుకున్నాం. వెంకటేష్ నాకు బంధువు అన్న విషయం అక్కడే తెలిసింది.

    కాలేజీ రోజుల్లోనే నేను జీన్స్ వేసుకుని స్టైలిష్ గా ఉండేదాన్ని. అలాంటివి వేసుకోవద్దని వెంకటేష్ చెప్పేవాడు. పూలు, గాజులు, బొట్టు పెట్టుకోవాలని సూచించేవాడు. అందుకే అతనంటే నచ్చేది కాదు ఆ తర్వాత ఐ లవ్ యు అని మెసేజ్ లు పెట్టి డిలీట్ చేసేవాడు. దాంతో అతనిపై ఇంకా కోపం పెరిగింది. కానీ ఆ తర్వాత కొన్ని కష్టమైన పరిస్థితుల్లో వెంకటేష్ నాకు చాలా సపోర్ట్ చేశాడు. కొంతకాలం తర్వాత పెద్దలు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. ఒకరంటే మరొకరికి ఇష్టం ఉండటంతో పెళ్లిచేసుకున్నామని చెప్పకొచ్చింది బర్రెలక్క.