https://oktelugu.com/

Astrologer Venu Swamy : మరో స్టార్ హీరోని టార్గెట్ చేసిన వేణు స్వామి… ఆ సూపర్ హిట్ మూవీ నాదే అంటూ కీలక కామెంట్స్!

అన్నీ అబద్ధాలు అని కొట్టిపారేసే వారు ఉన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు రష్మిక మందన, డింపుల్ హయాతి, నిధి అగర్వాల్... వేణు స్వామి తో ప్రత్యేక పూజలు చేయించడం గమనార్హం.

Written By: , Updated On : April 30, 2024 / 09:23 PM IST
Astrologer Venu Swamy

Astrologer Venu Swamy

Follow us on

Astrologer Venu Swamy : జూనియర్ ఎన్టీఆర్ – వి వి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన అదుర్స్ మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్లు ఇప్పటికి కూడా ట్రెండ్ అవుతుంటాయి. అదుర్స్ మూవీలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేశారు. చారి, నరసింహగా భిన్నమైన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా పై తాజాగా వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తన బయోపిక్ గా తెరకెక్కిందని షాకిచ్చాడు.

వేణు స్వామి కి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. నిత్యం ఇండస్ట్రీలోని స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఏదో ఒక కొత్త వివాదానికి తెరలేపుతుంటాడు. ప్రభాస్ కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి .. ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. ప్రభాస్ అభిమానులు వేణు స్వామిని దారుణంగా ట్రోల్ చేశారు. వేణు స్వామి కూడా వాళ్లకు గట్టిగానే కౌంటర్లు ఇచ్చాడు.

ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ సినిమాని ఉదేశిస్తూ కామెంట్స్ చేశాడు. వేణు స్వామి మాట్లాడుతూ… వినాయక్ ఈ సినిమాని తన బయోపిక్ గా తీశారని అన్నారు. ఇందులో చారి, నరసింహ పాత్రలు తనవేనని అన్నారు. ఈ సినిమాకి పూజ కూడా తానే చేశాడట. పూజ కార్యక్రమంలో ఎన్టీఆర్ కొబ్బరికాయ కొడితే పువ్వు వచ్చిందట .. అప్పుడే ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుంది అని చెప్పానని వేణు స్వామి అన్నారట.

వేణు స్వామి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉంటే .. వేణు స్వామి ఇప్పటికే కొందరు సెలెబ్రెటీల జాతకాలు చెప్పి సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాడు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది అని నమ్మేవారు లేకపోలేదు. అన్నీ అబద్ధాలు అని కొట్టిపారేసే వారు ఉన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు రష్మిక మందన, డింపుల్ హయాతి, నిధి అగర్వాల్… వేణు స్వామి తో ప్రత్యేక పూజలు చేయించడం గమనార్హం.