Barrelakka Marriage: బర్రెలక్క కు కాబోయే భర్త అతడే.. ఇంతకీ పెళ్లి ఎప్పుడంటే?

హఠాత్తుగా పెళ్లి నిర్ణయం కావడంతో.. అందర్నీ పిలవడం కుదరడం లేదని ప్రకటించిన శిరీష.. తన పెళ్లి తేదీ, కాబోయే భర్త ఎవరు అనే వివరాలన్నిటిని సోషల్ మీడియాలో ప్రకటించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : March 25, 2024 1:53 pm

Barrelakka alias Sirisha husband photos

Follow us on

Barrelakka Marriage: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బర్రెలక్కగా ప్రాచుర్యం పొందిన కర్నే శిరీష త్వరలో పెళ్లి చేసుకోనుంది. తనకు కాబోయే భర్త ఎవరు? పెళ్లి తేదీ ఎప్పుడు? ఈ వివరాలను కూడా శిరీష అలియాస్ బర్రెలక్క సోషల్ మీడియా వేదిక ప్రకటించింది. బర్రెలక్క స్వస్థలం ఉమ్మడి పాలమూరు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్. ఇటీవల తన పెళ్లికి సంబంధించిన ముందస్తు కార్యక్రమాలు మొదలయ్యాయని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన శిరీష.. కాబోయే భర్త ఎవరని నెటిజన్లు ప్రశ్నిస్తే మౌనమే సమాధానంగా ఉండిపోయింది. ఇన్ని రోజులపాటు తనకు కాబోయే భర్త ఎవరో చెప్పకుండా గోప్యత పాటించింది.

హఠాత్తుగా పెళ్లి నిర్ణయం కావడంతో.. అందర్నీ పిలవడం కుదరడం లేదని ప్రకటించిన శిరీష.. తన పెళ్లి తేదీ, కాబోయే భర్త ఎవరు అనే వివరాలన్నిటిని సోషల్ మీడియాలో ప్రకటించింది. తన పెళ్లికి ముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ సాంగ్ వీడియోని కూడా తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. తన భర్త ఐడి కి దానిని ట్యాగ్ చేసింది. బర్రెలక్క కు కాబోయే భర్త పేరు వెంకటేష్. అతడి ఇన్ స్టా గ్రామ్ ఐడిలో ఎంఎస్సీ ఫిజిక్స్ తప్ప మిగతా వివరాలేవీ పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతం బర్రెలక్క ప్రీ వెడ్డింగ్ వీడియో సాంగ్ నెట్టింట హల్ చల్ సృష్టిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఆమెకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

బర్రెలక్క కు ఇద్దరు తమ్ములున్నారు. ఆమె తల్లి దినసరి కూలీ. తండ్రి దూరంగా ఉంటున్నాడు. ఇంట్లో ఆర్థిక సమస్యలు నేపథ్యంలో ఆమె డిగ్రీ వరకే చదువుకుంది. తన తల్లికి అండగా ఉంటున్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. నాలుగవ స్థానంలో నిలిచింది. డిగ్రీ చదివినా ఉద్యోగాలు వస్తలేవు.. అందుకే బర్రెలు కాస్తున్న అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో అప్పట్లో సంచలనం సృష్టించింది. అనంతరం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శిరీష కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసింది. చాలామంది యువత ఆమెకు అండగా ఉన్నప్పటికీ.. ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు. నీతో ఆమె నాలుగవ స్థానానికి పరిమితం కావలసి వచ్చింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత కొద్ది రోజులపాటు శిరీష నిశ్శబ్దంగా ఉండిపోయింది. హఠాత్తుగా తన పెళ్లి ప్రకటనతో సోషల్ మీడియాలో మరోసారి పాపులర్ అయింది. త్వరలోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కనుంది.

అప్పటి ఎన్నికల్లో బర్రెలక్క పోటీలో ఉండడంతో కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు ఆమెను బెదిరించారు. ఆమె సోదరుడిని కొట్టారు. బర్రెలక్కకు ఇదివరకే వివాహం జరిగిందని ప్రచారం చేశారు. దీంతో ఆమె ఆవేదన చెందారు. కన్నీటి పర్యంతమయ్యారు. తన వ్యక్తిగత జీవితంపై ఎందుకు బురద చల్లుతున్నారని ప్రశ్నించారు. అప్పట్లో బర్రె లక్కపై నెగిటివ్ ప్రచారం చేసిన ఓ పార్టీ నాయకులపై అక్కడి స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఈ సంఘటన ఉమ్మడి పాలమూరు జిల్లాలో సంచలనంగా మారింది. ఎన్నికల్లో ఓడిపోవడంతో కొద్దిరోజుల పాటు నిశ్శబ్దంగా ఉన్న బర్రెలక్క.. ప్రస్తుతం తన పెళ్లి ప్రకటనతో మరోసారి వార్తల్లో వ్యక్తయింది.