spot_img
HomeతెలంగాణBandi Sanjay strong counter to CM: కమలమే ప్రాణం.. కాషాయమే ఊపిరి.. సీఎంకు బండి...

Bandi Sanjay strong counter to CM: కమలమే ప్రాణం.. కాషాయమే ఊపిరి.. సీఎంకు బండి స్ట్రాంగ్‌ కౌంటర్‌!

Bandi Sanjay strong counter to CM: బీజేపీ అంటేనే కరుడుగట్టిన హిదుత్వ పార్టీ. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేసిన సభ్యులు బీజేపీలో కీలక పదవుల్లో ఉన్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేదు. పార్టీ కోసం పనిచేసుకుంటూ పోతారు. హిందుత్వమే ఎజెండాగా కష్టపడతారు. దేశభక్తిని చాటుతారు. దేశం కోసం పనిచేస్తారు. ఐదారేళ్లుగా ఇతర పార్టీల వారు బీజేపీలో చేరుతున్నారు. కారణం కేంద్రంలో బీజేపీ వరుసగా విజాయాలు సాధిస్తుండడమే. అయినా వాళ్లు కూడా బీజేపీ సిద్ధాంతాలకు పూర్తిగా కట్టుబడకపోయినా ఒబిడియంట్‌గా ఉంటున్నారు. మొదటి నుంచి ఉంటున్న కాషాయవాదులు మాత్రం పార్టీని వీడడం లేదు. అలాంటివారిలో కేంద్ర మంత్రి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ఒకరు. ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేసిన సంజయ్‌ తర్వాత ఏబీవీపీ కార్యకర్తగా సేవలు అందించారు. తర్వాత కార్పొరేటర్‌గా రాజకీయ జీవితం బీజేపీలో మొదలు పెట్టారు. కేంద్ర మంత్రిగా ఎదిగారు. అయితే తాజాగా బండి సంజయ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి వలస వాదిగా వ్యాఖ్యలు చేశారు. వీటిని బండి తిప్పికొట్టారు.తనకు పార్టీ మార్పు ఆలోచన ఎప్పుడూ రాలేదని, తుది శ్వాస వరకు బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితం బీజేపీకి అంకితమని తెలిపారు.

శవంపై కాషాయం జెండానే..
తన ప్రాణం కమలం అని తన ఊపిరి కాషాయం అని గర్వంగా ప్రకటించారు. చివరకు తాను చనిపోతే తన శవంపై కూడా కాషాయ జెండా కప్పాలన్నారు. ఆ దృశ్యం చూసేందుకు రేవంత్‌ రెడ్డి నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ మాటలు పార్టీపై బండికి ఉన్న అచంచల విశ్వాసాన్ని తెలియజేస్తున్నాయి. రాజకీయ శత్రువులకు సవాల్‌గా మారాయి. గతంలో బీజేపీలో అంతర్గత కలహాలు ఎదుర్కొన్నప్పటికీ, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదని, పార్టీ మారాలని ఆలోచించలేదని స్పష్టం చేశారు.

డీలిమిటేషన్‌ భయమెందుకు?
డీలిమిటేషన్‌ ప్రక్రియపై సీఎం రేవంత్‌ ప్రజల్లో అనవసర భయాలు కలిగిస్తున్నారని బండి ధ్వజమెత్తారు. ఈ చర్చలు తెలంగాణలో స్థానికులు–వలసల మధ్య విభేదాలను పెంచుతున్నాయని, ప్రభుత్వం రాజకీయ లాభం కోసం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ నేతలు ఈ అంశాన్ని ఎత్తిచూపుతూ, కేంద్ర స్థాయిలో సమతుల్య పరిష్కారం కోరారు. ఇది రాష్ట్ర అసెంబ్లీలో కూడా హాట్‌ టాపిక్‌గా మారింది.

బండి రాజకీయ ప్రయాణం..
కార్పొరేటర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన బండి సంజయ్‌ 2019లో కరీంనగర్‌ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2024లో మరోసారి గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. 2020 నుంచి 2023 వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. పార్టీలో అంతర్గత సవాళ్లను అధిగమించారు.బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.

ఈ సంఘటన తెలంగాణలో కాంగ్రెస్‌–బీజేపీ మధ్య యుద్ధాన్ని ఊపందుకునేలా చేస్తోంది. బండి వ్యాఖ్యలు ప్రజల్లో భావోద్వేగాలను రేకెత్తిస్తూ, ఆయన ఇమేజ్‌ను హీరోగా నిలబెడుతున్నాయి. డీలిమిటేషన్‌ వంటి సమస్యలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. బీజేపీ ఈ మొమెంటమ్‌ను ఉపయోగించుకుని, 2028 ఎన్నికలకు వ్యూహాలు రూపొందిస్తుందించే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular