HomeతెలంగాణBandi Sanjay : బండికి బలం దొరికింది.. ఇక తిరుగులేదు పో..! 

Bandi Sanjay : బండికి బలం దొరికింది.. ఇక తిరుగులేదు పో..! 

Bandi Sanjay : తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌పై సొంత పార్టీలోనే కొన్ని రోజులుగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధ్యక్షుడిగా మూడేళ్ల పదవీకాలం పూర్తయినందున అధిష్టానం అధ్యక్షుడిని మారుస్తుందని బండి వ్యతిరేకవర్గం భావించింది. త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎండికలు ఉండడం, మరోవైపు అమిత్‌షా అండ బండి సంజయ్‌కు మెండుగా ఉండడంతో బండి సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఈమేకు స్పష్టత కూడా ఇచ్చింది. ఈ విషయం ఆయన వ్యతిరేకవర్గానికి మింగుడు పడడం లేదు. బండి సంజయ్‌ సారథ్యంలో ఎన్నికలకు వెళితే.. ముఖ్యమంత్రి కూడా ఆయనే అవుతారని వ్యతిరేకవర్గం ఆలోచన దీంతో అధ్యక్షుడి మార్పునకు ఈ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంతో జాతీయ నాయకత్వం కూడా పునరాలోచనలో పడింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అంతర్గత కుమ్ములాటలకు స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పార్టీలో మార్పులకు సంకేతాలిచ్చింది.

సారథిగా బండి.. ప్రచార సారథిగా ఈటల.. 
తెలంగాణలో ఎన్నికలకు సిద్దమవుతున్న బీజేపీలో కీలక మార్పులకు అధిష్టానం స్పష్టమైన సంకేతాలిచ్చింది. బండిని సారథిగా కొనసాగిస్తూనే ఈటల రాజేందర్‌ను ప్రచారకమిటీ సారథిగా నియమిస్తామని లీక్‌ ఇచ్చింది. మరికొంతమంది అసంతృప్తులకు కూడా కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డీకే. అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి లాంటి నేతలకు కూడా కీలక పదవులు దక్కుతాయన్న ప్రచారం జరుగుతోంది.
రంగంలోకి మురళీధర్‌రావు.. 
బీజేపీలో కీలక మార్పులపై ప్రచారం జరుగుతుండగా, ఆ పార్టీ జాతీయనేత మురళీధర్‌రావు రంగంలోకి దిగారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ నాయకత్వంలో పనిచేస్తామని స్పష్టం చేశారు. అధిష్టానం సంజయ్‌ను అధ్యక్షుడిగా నియమించినందున ఆయన సారథ్యంలోనే పనిచేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఆయన సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా మాతావరణం మారిపోయింది. మురళీధర్‌రావు సారథ్యంలోనే బండి వ్యతిరేకవర్గం పనిచేస్తుందని ఒకవైపు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మురళీధర్‌రావు సంజయ్‌కు మద్దతు ఇవ్వడం అందరినీ షాక్‌కు గురిచేసింది. దీంతో ఇక సంజయ్‌ వ్యతిరేకవర్గంలో ఉన్నవారెవరు అన్న చర్చ మొదలైంది.
ఈటల ఏం చేస్తారు.. 
మురళీధర్‌రావు యూటర్న్‌తో ఇప్పుటు బండి వ్యతిరేకవర్గంగా ప్రచారం జరుగుతున్న ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, డీకే.అరుణ వర్గంలో సందిగ్ధం నెలకొంది. కర్ణాటక ఎన్నికల తర్వాత వీరంతా సైలెంట్‌గా ఉంటున్నారు. మురళీధర్‌రావు ప్రకటన నేపథ్యంలో ఈ వర్గం ఏం చెబుతుందన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు బండి సంజయ్‌కు పెద్ద అండ దొరకడం ఆయన వర్గానికి ఊరట లభించింది.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular