https://oktelugu.com/

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మళ్లీ బండి సంజయ్.. ఈ సారి ప్లాన్ ఏంటంటే?

భారతీయ జనతాపార్టీకి ఇప్పుడు అధ్యక్షులు దొరకడం లేదు. పార్టీ సిద్ధాంత ప్రకారం.. ఒకరికి ఒక్కటే పదవి. కానీ, కొన్ని నెలలుగా పార్టీ ఈ సిద్ధాంతాన్ని పక్కన పెట్టింది. జాతీయ సారథి జేపీ.నడ్డాకు కేంద్రంలో మంత్రిపదవి ఇచ్చింది. తెలంగాణ సారథి కిషన్‌రెడ్డికి కూడా కేంద్రంలో మంత్రిపదవి దక్కింది. ఇద్దరూ జోడు పదవులు నిర్వహిస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 6, 2024 / 12:32 PM IST

    Bandi Sanjay

    Follow us on

    Bandi Sanjay: భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. కరుడుగట్టిన హిందూ వాదులే ఈ పార్టీలో ఎక్కువగా ఉంటారు. దాదాపు అందరికీ ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం ఉటుంది. అయితే పార్టీ విస్తరణలో భాగంగా ఇటీవల బీజేపీ పార్టీ సిద్ధాంతాల విషయంలో కాస్త పట్టు విడులు చేస్తోంది. ఇతర పార్టీలకు చెందిన నేతలను పార్టీలో చేర్చుకుంటోంది. పార్టీ సిద్ధాంతాలను నమ్ముతాడా, పాటిస్తాడా, గౌరవిస్తాడా అనేవి చూడకుండా అధికారమే లక్ష్యంగా చేరికలను ప్రోత్సహిస్తోంది. దీంతో క్రమశిక్షణ గల బీజేపీలోనూ క్రమశిక్షణ కాస్త తపుపతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి బీజేపీలో మొదటి నుంచి ఉన్నవారికి మధ్య సఖ్యత కుదరడం లేదు. దీంతో ఎవరికివారు ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాతున్నారు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో అధిష్టానం కూడా మడి కట్టుకుని కూర్చుంటే కుదరదు అన్నట్లుగా సిద్ధాంతాల్లో మార్పులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా పదవీ కాలం పూర్తయి ఆరు నెలలు కావస్తోంది. ఎన్నికల నేపథ్యంలో పదవీకాలం పొడిగింది. ఎన్నికలు ముగిసినా కొత్త అధ్యక్షుడిని నియమించడం లేదు. ఇక రాష్ట్ర అధ్యక్షుడి పదవీ కాలం ముగిసి ఏడాది దాటింది. తాత్కాలిక అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమించింది. కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. తాజాగా కొత్త అధ్యక్షడి ఎన్నికపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

    రేసులో మళ్లీ ఆయనే..
    తెలంగాణలో బీజేపీ పగ్గాలు మళ్లీ పాత అధ్యక్షుడికే కట్టబెట్టే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు బీజేపీ అంటే బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఇంద్రారెడ్డి, వెంకయ్య నాయుడు లాంటి నేతలే కనిపించేవారు. కానీ, ఇప్పుడ తెలంగాణలో బీజేపీలో చాలా మంది కీలకనేతలుగా ఎదిగారు. పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్లింది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన పార్టీ ఇప్పుడు పల్లెలకూ చేరింది. ఇందులో మాజీ అధ్యక్షుడు కేంద్రమంత్రి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ పాత్ర ఎవరూ కాదనలేదు. కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, లక్ష్మణ్‌ అధ్యక్షులుగా ఉన్న కాలంలో పార్టీ ఏవలం పట్టణాలే పరిమితమైంది. బండి సంజయ్‌ అధ్యక్షుడు అయ్యాక పార్టీని క్షేత్రస్తాయికి తీసుకెళ్లారు. పాదయాత్రతో పార్టీకి ఊపె తెచ్చారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 8, లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లు రావడానికి పరోక్షంగా బండి సంజయే కారణం. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం మరోమారు సంజయ్‌కే పార్టీ పగ్గాల అప్పగించాలని చూస్తోంది.

    రేసులో వీరు..
    అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి తప్పు చేశామన్న భావనలో బీజేపీ అధిష్టానం ఉంది. అయితే తెలంగాణ పగ్గాలు చేపట్టేందుకు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, పోటీ పడుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా, జమ్మూకశ్మీర్‌ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన రాష్ట్ర పార్టీపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది.

    ఈటలకు చెక్‌ పెట్టేందుకేనా..
    బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించేందకు ఈటల రాజేందరే కారణమన్న అభిప్రాయం పార్టీ కేడర్‌లో ఉంది. సంజయ్‌ కూడా ఇదే భావనలో ఉన్నారు. దీంతో కిషన్‌రెడ్డి స్థానంలో ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగించకుండా ఇప్పుడు సంజయ్‌ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రిగా ఉన్నా, ఈ మధ్య రాష్ట్ర వ్యవహరాల్లో బండి సంజయ్‌ చురుగ్గా ఉంటున్నారు. ఖమ్మం వరదల విషయంలోనూ పార్టీ తరఫున ఆయన పర్యటనకు రెడీ కావటం, ఈ లోపు ఈటల కూడా ముందుకు రావటంతో రెండు బృందాలుగా వెళ్తున్నారు. అయితే, బండి స్పీడ్‌ పెంచటంతోం ఆయన్ను మళ్లీ రాష్ట్ర బాధ్యతలకు పంపుతారా? కేంద్రమంత్రిగా ఉన్నా రాష్ట్ర పార్టీ బాధ్యతలు కూడా అప్పగించబోతున్నారా? అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పార్టీ అధినాయకత్వం కూడా గతంలో చేసిన తప్పుతో మరోసారి బండికే అవకాశం ఇవ్వబోతుందన్న ప్రచారం జోరుగా పార్టీలో సాగుతోంది.