Balka Suman: బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు కనీవిని ఎరుగని రీతిలో వర్షాలు కురిశాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ అతలాకుతలమైంది. తెలంగాణలో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. ఇద్దరు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు సమస్థితిని పునరుద్ధరించే పనిలో పడ్డారు. బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. తెలంగాణలో మృతులతోపాటు, రైతులకు సాయం ప్రకటించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ క్రమంలో ఊహించిన పరిణామంలో, నాని యొక్క సరిపోద శనివారం తెలంగాణాలో రాజకీయ చర్చకు దారితీసింది. బీఆర్‌ఎస్ దీనిపై అసాధారణమైన వాదనను చేసింది. తెలంగాణ వరదలతో అతలాకుతలం అవుతుంటే æ సీఎం రేవంత్ రెడ్డి సరిపోద శనివారాన్ని చూస్తున్నారని కేసీఆర్, కేటీఆర్‌ల నమ్మకస్తుడు, బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు.
శని, ఆదివారాల పరిస్థితిపై..
గత శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిశాయి. నదులు పొంగాయి. వరద పరిస్థితి మరింత దిగజారింది. ఈ సమయంలో తెలంగాణ సీఎం ఎక్కడ ఉన్నారు? అతను తన కుటుంబంతో కలిసి తన ఇంట్లో కూర్చుని సరిపోద శనివారం సినిమా చూస్తున్నాడు అని బాల్క సుమన్ ఆరోపించారు. తెలంగాణ వరదలు ముంచెత్తుతున్న సమయంలో ఆయన తన ఇంట్లో సినిమా చూసే పనిలో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. ప్రజలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. కష్టసమయంలో అండగా ఉండాల్సిన సీఎం.. కుంటుంబంతో ఎంజాయ్ చేశాడని విమర్శించారు.
గత వారమే సినిమా విడుదల..
ఇదిలా ఉంటే సరిపోద శనివారం గత వారాంతంలో మాత్రమే థియేటర్లలో విడుదలైంది. ఇది స్పష్టంగా ఓటీటీలోకి రాలేదు. కాబట్టి, రేవంత్ తన ఇంట్లో సినిమా చూడటం వెనుక లాజిక్ ఏంటని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. దీని అర్థం బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ బాల్క సుమన్ కేవలం నాని నటించిన చిత్రాన్ని ఉపయోగించి బ్లఫ్ చేస్తున్నారు. కాగా, తమ రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వ యంత్రాంగం, సహాయక సిబ్బంది ప్రయత్నాలను అవమానపరిచారంటూ రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ క్యాంపుపై ఫైర్ అవుతున్నారు. అమెరికాలో కులుకుతున్న నేతలు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు.
ప్రతిపక్ష నేత ఎక్కడ..
ప్రజలు వరదలతో అల్లాడుతుంటే.. అమెరికాలో ఉన్న కేటీఆర్ స్పందిస్తున్నాడు కానీ, తెలంగాలణలో ఉన్న కేసీఆర్ కనీసం నోరు మెదపడం లేదు. దీనిని కూడా సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్ చేశారు. తాము ప్రశ్నించిన తర్వాతనే మాజీ మంత్రి హరీశ్‌రావు వరద బాధిత ప్రాంతాల పర్యటన చేపట్టారని విమర్శించారు. ప్రజలకు అండగా నిలవాలన్న సోయి విపక్ష నేతలకు లేదని మండిపడ్డారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More