Nidhi Agarwal: అందం, నటన, డ్యాన్స్ ఇలా అన్ని విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన హీరోయిన్స్ మన సౌత్ లో చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు నిధి అగర్వాల్(Nidhi Agarwal). ఈమె 2017 వ సంవత్సరం లో ‘మున్నా మైఖేల్’ అనే చిత్రం ద్వారా వెండితెర కి పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగు లో ఈమె అక్కినేని నాగచైతన్య హీరో గా నటించిన ‘సవ్యసాచి’ అనే చిత్రం ద్వారా మన ఆడియన్స్ కి పరిచయమైంది. పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే కాబట్టి ఈమెకు తెలుగు భాషపై మంచి పట్టు ఉంది. మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి అయినప్పటికీ కూడా, ఈమెకు అదృష్టం కలిసి రాలేదు. ఈమె కెరీర్ మొత్తం మీద సూపర్ హిట్ సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం మాత్రమే. ఆ తర్వాత ఈమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.
కానీ మంచి టాలెంట్ తో పాటు అందం కూడా ఉన్న అమ్మాయి కావడంతో ఈమెకు అవకాశాలు రావడం మాత్రం ఆగలేదు. ఏకంగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu), ప్రభాస్(Rebel Star Prabhas) తో ‘రాజా సాబ్'(Raja Saab) వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ రెండు సినిమాల్లోనూ తనకు నటనకు అత్యధిక ప్రాధాన్యం ఉన్న పాత్రలు దొరికింది అంటూ ఇటీవల జరిగిన అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి. ఇకపోతే ఈమె ఖాతాలో ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. తమిళ హీరో సూర్య మన తెలుగు లో చేస్తున్న మొట్టమొదటి సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ఎంపిక అయ్యిందట.
ఇది ఆమెకు మామూలు బంపర్ ఆఫర్ కాదు అనే చెప్పొచ్చు. ఎందుకంటే మీడియం రేంజ్ హీరోయిన్ గానే ఇన్ని రోజులు కొనసాగుతూ వచ్చిన ఈమెకు, ఇప్పుడు వరుసగా పాన్ ఇండియన్ సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ రావడమంటే ఆమె నెత్తి మీద అదృష్ట దేవత తాండవిస్తుంది అనొచ్చు. ‘హరి హర వీరమల్లు’, ‘రాజా సాబ్’ చిత్రాలు సూపర్ హిట్ అయితే ఇక నిధి అగర్వాల్ రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంటుంది. ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోతుంది. ఆ రేంజ్ కి వెళ్లేందుకు అన్ని రకాలుగా అర్హతలు ఉన్న హీరోయిన్ ఆమె. రీసెంట్ గానే ‘హరి హర వీరమల్లు’ నుండి ‘కొల్లగొట్టినాదిరో’ అనే పాట విడుదలైన సంగతి తెలిసిందే. ఒక రేంజ్ లో ట్రెండింగ్ అవుతున్న ఈ పాటలో నిధి అగర్వాల్ మంచి మార్కులే కొట్టేసింది.