https://oktelugu.com/

Audit Bureau of Circulation : అనుకూల జీవో ఇచ్చినా సాక్షి లేవలేదు.. కోర్టుకు వెళ్లినా ఈనాడు గెలవలేదు.

తెలంగాణలో మొత్తంగా చూస్తే ఈనాడు 5.5 లక్షలు, సాక్షి 3.5 లక్షలు, ఆంధ్రజ్యోతి 1.5 లక్షలు. త్వరలో ఎన్నికలు ఉన్న.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లక్షల లక్షల కాపీలు డంప్ చేయించి పంచే సీన్ లేదు. ఇప్పటికైతే రేవంత్ జాకెట్ యాడ్స్ ఇస్తున్నాడు గానీ.. అంతకుమించి హెల్ప్ చేసే పొజిషన్ అయితే లేదు.

Written By:
  • NARESH
  • , Updated On : April 10, 2024 / 08:35 PM IST

    ABC Rating

    Follow us on

    Audit Bureau of Circulation : వేలాదిమంది వలంటీర్లు.. ప్రతినెల సాక్షి పత్రిక కొనేందుకు డబ్బులు.. పైగా అధికారం ఉంది.. కోట్లకు కోట్ల యాడ్స్.. ఇన్ని జాకీలు పెట్టి లేపుతున్నాడు. ఇక ఈనాడు పని ఖతమే, దాని నెంబర్ వన్ స్థానం గతమే అని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వలంటీర్లతో పేపర్ కొనిపిస్తున్నాడు.. దానివల్ల తన నెంబర్ వన్ స్థానం పోతుందని ఈనాడు గగ్గోలు పెట్టింది. కోర్టుకు వెళ్ళింది. పాపం అక్కడ దానికి ఎదురు దెబ్బ తగిలింది. రామోజీరావు పెద్దగా ఇబ్బంది పడిపోయాడు గాని.. సాక్షి వల్ల.. జగన్ తీసుకొచ్చిన ఆ జీవో వల్ల ఈనాడుకు పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈనాడును సాక్షి బీట్ చేయలేకపోయింది. కోర్టుకు వెళ్లి రామోజీరావు అనవసరంగా అభాసు పాలయ్యాడు.. తాజాగా విడుదలైన ఏబీసీ గణాంకాలలో ఈనాడు నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సాక్షి ఈనాడుకు దూరంలోనే నిలిచిపోయింది. ఎప్పటిలాగే అది రెండో స్థానానికే పరిమితమైపోయింది. ఇక ఆంధ్రజ్యోతి పెద్దగా ఎదుగుదల లేకుండానే తన మూడవ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

    వాస్తవానికి జగన్ పొలిటికల్ లైన్ కు అనుగుణంగా సాక్షి ఎప్పుడూ పనిచేయదని ఆరోపణలు ఎప్పటినుంచో వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే కదా జగన్ పదేపదే తనకు సొంత మీడియా లేదు అని చెప్పేది. కర్నూలు, నెల్లూరు, తిరుపతి, ఒంగోలు లో మాత్రమే ఈనాడు కంటే సాక్షి బెటర్ గా ఉంది. మిగతా జిల్లాల్లో రెండవ స్థానంలో ఉంది. అక్కడిదాకా ఎందుకు జగన్ సొంత జిల్లాలోనే సాక్షి రెండవ స్థానంలో ఉంది.. వాస్తవానికి ఏపీలో కులాల కుంపట్లు ఎక్కువ. అక్కడ ప్రధానంగా పబ్లిషయ్యే మూడు పత్రికలు ఒకే రకంగా ఉంటాయి. అంటే అధికార పార్టీకి సాక్షి డప్పు కొడుతుంది. మిగతా రెండు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈనాడుకు బాకాలు ఊదుతాయి. ఇందులో ఆంధ్రజ్యోతి ది డిఫరెంట్ స్టైల్. ఎందుకంటే అది బజార్లో నిలబడి పోతురాజు లాగా ఒళ్లంతా పసుపు రంగు పూసుకొని చంద్రబాబు నామస్మరణ చేస్తుంది. అయినప్పటికీ దాని లెక్క 2.3 లక్షల సర్కులేషన్ దగ్గరే ఆగిపోయింది. తాడేపల్లిగూడెం, శ్రీకాకుళం, రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతాల్లో ఆంధ్రజ్యోతి గురించి ఎంత తక్కువ ప్రస్తావిస్తే అంత మంచిది. స్థూలంగా 7.4 లక్షల కాపీలతో ఈనాడు ఇప్పటికి ఏపీలో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. సాక్షి 6.5 లక్షలతో రెండవ స్థానంలో ఉంది. అంటే ఈనాడుకు సాక్షికి దాదాపు 90,000 తేడా.

    ఇక తెలంగాణ విషయానికొస్తే భారత రాష్ట్ర సమితికి మొన్నటిదాకా సాక్షి ట్రంపెట్ వాయించింది. అది నమస్తే సాక్షి లాగా మారిపోయింది. భారత రాష్ట్ర సమితి కుప్పకూలినప్పటికీ అది కేసీఆర్ వైపే ఉంది. ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి పొడ రేవంత్ కు గిట్టదు. కాంగ్రెస్ పార్టీకి కూడా అది నచ్చదు. వాస్తవానికి తెలంగాణలో జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ లాభాలు లేవు కాబట్టి న్యూట్రల్ గా ఉంటే బాగుండేదేమో. కానీ అది గులాబీ పాజిటివ్ స్టాండ్ తీసుకుంది. జై కేసీఆర్ అన్నట్టుగానే దాని వ్యవహారం సాగింది. తెలంగాణ విషయంలో హైదరాబాద్ ను పక్కన పెడితే.. మిగతా జిల్లాల్లో ఈనాడుకు సాక్షి దరిదాపుల్లో లేదు. ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా లేదు.. కరీంనగర్, పాలమూరు, నిజామాబాద్, వరంగల్ జిల్లాలో సర్క్యులేషన్ గురించి ఈనాడుతో పోటీపడేంత సీన్ సాక్షికి లేదు. ఉదాహరణకు ఈనాడు ఇప్పటికీ కరీంనగర్లో 60 వేల కాపీలు ప్రింట్ చేస్తోంది. ఈ విషయంలో సాక్షి 25వేల దగ్గరే ఆగిపోయింది.

    ఇక ఈనాడు కు తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి. ఇప్పటిదాకా అది కేసీఆర్ తో సఖ్యతతో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ రేవంత్ తమ క్యాంపులోని వాడు కాబట్టి.. రేవంత్ కు అనుకూలంగా.. కేసీఆర్ ను గిచ్చి గిల్లనట్టుగా వార్తలు రాస్తోంది. అయితే ఇప్పటికి ఎటువంటి లైన్ తీసుకోవాలనేది ఈనాడుకు అంతు పట్టడం లేదు. ఈరోజుకు ఈనాడు తెలంగాణలోనూ నెంబర్ వన్ గా ఉంది అంటే దానికి బలమైన ఏజెన్సీలు కూడా కారణం. ఇటీవలి కాలంలో కేసీఆర్ గులాబీ రంగును ఈనాడు దట్టంగా పూసుకోకపోవడం వల్ల కూడా కావచ్చు.

    ఇక ఆంధ్రజ్యోతి వరంగల్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. మిగతా జిల్లాలోనూ గతంలో ఈనాడుకు పోటీ ఇచ్చేది. కానీ ఇప్పుడు చాలా జిల్లాల్లో అది సాక్షి కంటే, ఈనాడు కంటే చాలా దూరం జరిగిపోయింది. హైదరాబాదులో అంతంతమాత్రంగానే దాని పరిస్థితి ఉంది. అంత పెద్ద సిటీలో అది చేసే ప్రింటింగ్ 55వేల కాపీలు. తెలంగాణలో మొత్తంగా చూస్తే ఈనాడు 5.5 లక్షలు, సాక్షి 3.5 లక్షలు, ఆంధ్రజ్యోతి 1.5 లక్షలు. త్వరలో ఎన్నికలు ఉన్న.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లక్షల లక్షల కాపీలు డంప్ చేయించి పంచే సీన్ లేదు. ఇప్పటికైతే రేవంత్ జాకెట్ యాడ్స్ ఇస్తున్నాడు గానీ.. అంతకుమించి హెల్ప్ చేసే పొజిషన్ అయితే లేదు.