https://oktelugu.com/

BJP MP Khagen Murmoo : ప్రచారంలో యువతికి ముద్దుపెట్టిన ఎంపీ.. దుమారం

మరోవైపు తన ప్రచారంపై దుమారం రేగడంతో బీజేపీ ఎంపీ ఖగేన్‌ స్పందించారు. ముద్దు ఘటనపై స్పష్టత ఇచ్చారు. ‘‘ఆమెను నా కుమార్తెలా భావించా. పిల్లలకు ముద్దు పెడితే తప్పేంటి? కుట్రపూరితంగా దీనిపై వివాదం సృష్టిస్తున్నారు. ఇలాంటి చిత్రాలను వక్రీకరించి వ్యక్తులు, పార్టీల పనువుకు భంగం కలిగిస్తున్నారు. వారిపై(టీఎంసీ) ఫిర్యాదుచేస్తాం’’ అని వెల్లడించారు.

Written By:
  • NARESH
  • , Updated On : April 10, 2024 8:49 pm
    BJP MP

    BJP MP

    Follow us on

    BJP MP Khagen Murmoo : లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో దేశమంతా అన్ని పార్టీలు ప్రచారం జోరు పెంచాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్‌లో ఓ బీజేపీ ఎంపీ కూడా ఇటీవల ఓట్ల కోసం ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఆ సమయంలో ఓ యువతి బుగ్గపై ఆయన ముద్దు పెట్టాడు. ఇది ఇప్పుడు వివాదాస్పదమైంది. ప్రచారంలో యువతికి ఎంపీ ముద్దు పెట్టిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

    అసలేం జరిగిందంటే..
    బెంగాల్‌లోని ఉత్తర మల్దా లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ ఖగేన్‌ ముర్మూ పోటీ చేస్తున్నారు. గత సోమవారం(ఏప్రిల్‌ 8న) తన నియోజవర్గం పరిధిలోని శ్రీహిపుర్‌ గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అక్కడ ఆయన ఓ యువతి చెంపపై ముద్దు పెట్టాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపింది.

    తృణమూల్‌ రచ్చ..
    ఎంపీ యువతికి ముద్దు పెట్టిన ఘటనపై పశ్చిమ బెంగాల్‌ అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది. బీజేపీని దుయ్యబట్టింది. ‘బీజేపీ ఎంపీ ఉత్తర మల్దా అభ్యర్థి ఖగేన్‌ముర్ము ప్రచారం సందర్భంగా ఓ యువతికి ముద్ద పెట్టారు. మహిళా రెజ్లర్లను ౖలñ ంగికంగా వేధించే ఎంపీలు, బెంగాలీ మహిళలపై అసభ్యకర పాటలు రాసే నేతలు.. ఇలా బీజేపీ క్యాంపులో మహిళా వ్యతిరేక నాయకులకు కొదవలేదు. నారీమణులకు మోదీ పరివార్‌ ఇస్తున్న గౌరవం ఇది ఒకవేళ మళ్లీ వారు అధికారంలోకి వస్తే ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఊహించుకోండి’’ అని విమర్శించింది.

    స్పందించిన ఖగేన్‌..
    మరోవైపు తన ప్రచారంపై దుమారం రేగడంతో బీజేపీ ఎంపీ ఖగేన్‌ స్పందించారు. ముద్దు ఘటనపై స్పష్టత ఇచ్చారు. ‘‘ఆమెను నా కుమార్తెలా భావించా. పిల్లలకు ముద్దు పెడితే తప్పేంటి? కుట్రపూరితంగా దీనిపై వివాదం సృష్టిస్తున్నారు. ఇలాంటి చిత్రాలను వక్రీకరించి వ్యక్తులు, పార్టీల పనువుకు భంగం కలిగిస్తున్నారు. వారిపై(టీఎంసీ) ఫిర్యాదుచేస్తాం’’ అని వెల్లడించారు.

    యువతి స్పందన ఇదీ..
    ఇక ఈ ఘటనపై సదరు యువతి కూడా స్పందించారు. ఎంపీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ‘‘సొంత కూతురులా భావించి ఆయన ముద్దు పెట్టుకుంటే అందులో సమస్య ఏంటి? ఇలాంటి ఘటనలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసే వారిది చెత్త మనస్తత్వం. ఆ ఫొటో తీసిన సమయంలో మా అమ్మనాన్న కూడా అక్కడే ఉన్నారు’’ అని తెలిపారు.