Chilukuru Balaji Temple: చిలుకూరు బాలాజీ ఆలయం(Chilukuru Balaji Temple).. దేశంలోనే అత్యంత గుర్తింపు ఉన్న ఆలయాల్లో ఒకటి. ఇక్కడి వేంకటేశ్వరస్వామిని వీసా వెంకటేశ్వరస్వామి(Visa Venkateshwra Swamy)గా పిలుస్తారు. స్వామివారిని దర్శించుకుని 108 ప్రదక్షిణలు చేస్తే వీసా వస్తుందని యువత నమ్ముతారు. అందుకే ఈ ఆలయానికి యువతే ఎక్కువగా వస్తారు. ఈ ఆలయ ఆర్చకుడు రంగరాజన్‌పై ఇటీవల దాడి జరిగింది. దాడి చేసింది. రామరాజ్యం ఆర్మీ.
చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్(Rangaraja)పై దాడి తెలంగాణలో పెద్ద సంచలనంగా మారింది. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని రామరాజ్యం ఆర్మీ ప్రతినిధులు కోరారు. అందుకు ఆయన నిరాకరించడంతో దాడి చేశారు. దాడి చేసిన వారిలో ప్రధాన నిందితుడిగా వీర రాఘవరెడ్డి(Vera Raghava Reddy)ని గుర్తించారు. ఆయన తన అనుచరులతో కలిసి దాడి చేయడమే కాకుండా ఆయనతో మాట్లాడుతున్న దృశ్యాలను వీడియో తీయించారు. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ కూడా చేశారు. దీంతో రంగరాజన్ మొయినాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రామరాజ్యం సంస్థ వ్యవస్థాపకుడు వీరరాఘవ రెడ్డితోపాటు అతని ప్రైవేటు సైన్యంలోని 20 మందిపై కేసు నమోదు చేశారు. వీరరాఘవరెడ్డితోపాటు ఐదుగురిని అరెస్టు కూడా చేశారు. మిగతావరి కోసం గాలిస్తున్నారు.
ఎవరీ వీర రాఘవరెడ్డి..
ఇదిలా ఉంటే.. వీర రాఘవరెడ్డి ఎవరు అని చాలా మంది ఆరా తీస్తున్నారు. ఇతనిది ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని తూర్పుగోదావరి జిలా. గతేడాది సెప్టెంబర్‌లో రామరాజ్యం ఆర్మీ రిక్రూట్‌మెంట్(Ramarajyam Army Recrutment) కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. రామరాజ్యం సంస్థ వెబ్‌సైట్‌లో ఈ వివరాలు ఉన్నాయి. 5 వేల మందిని నియమించుకోవాలని నిర్ణయించినట్లు అందులో ఉంది. నియమించుకున్నవారికి నెలకు రూ.20 వేల వేతనంతోపాటు భోజనం, వసతి కల్పిస్తామని తెలిపారు. అయితే అందరినీ ఇందులో నియమించుకోరు. ఆర్మీలో నియమించుకోవడానికి ప్రధాన అర్హత ఉంది.
ఇక్ష్వాక, భరత వంశీకులకే అవకాశం..
దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కోసం ఈ రామరాజ్యం ఆర్మీ పనిచేస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే ఆర్మీలోకి రావడానికి ప్రధాన అర్హత(Mager Qualification) సభ్యులు ఇక్ష్వాక లేదా భరత వంశానికి చెందినవారై ఉండాలి. వారిని మాత్రమే తీసుకుంటారు. ఆర్మీలో చేరినవారు దాడులు చేయడానికి సిద్దంగా ఉండాలి. చావడానికి కూడా వెనుకాడొద్దు. రామరాజ్జ స్థాపనే సభ్యుల లక్ష్యం కావాలి. అయితే అర్హత కారణంగా ఈ నోటిఫికేషన్‌కు పెద్దగా స్పందన రాలేదు. దీంతో వీరరాఘవరెడ్డి కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అర్చకులను కలిసి.. రామరాజ్యం ఆర్మీ స్థాపనకు సహకరించాలని కోరుతున్నారు.
వశీయుల గుర్తింపు కోసం..
ఇక్ష్వాక, భరవ వంశీయులను గుర్తించడం కేవలం అర్చకులకే సాధ్యమవుతుంది. ఆలయాలకు వచ్చిన యువతను అడిగి వారి కులగోత్రాలు, వంశం గురించి తెలుసుకుని ఆ వివరాలను అందించాలని వీరరాఘవరెడ్డి కోరుతున్నారు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చారు. ఇక్కడికి యువత ఎక్కువగా వస్తుంటారు. ఈ నేపథ్యంలో వారి వివరాలు తెలుసుకుని ఇవ్వాలని అర్చకుడు రంగరాజన్‌ను కోరాడు. అయితే అందుకు ఆయన నిరాకరించాడు. తాను రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని తెలిపారు. దీంతో రామరాజ్యం సంస్థ వ్యవస్థాపకుడు అయిన వీర రాఘవరెడ్డితోపాటు, ఆత్మీ సభ్యులు దాడి చేశారు.
యువత లక్ష్యంగా..
ఇక రామరాజ్యం సంస్థ ప్రధాన లక్ష్యం యువత. వారిని ఆర్మీలోకి తీసుకోవడం కోసమే ఈ దాడి జరిగింది. వీరు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నమ్మడం లేదు. రామరాజ్యం స్థాపిస్తామన్న సంకల్పంతో ఉన్నారు. ఇందుకు ఫండ్ రెయిజింగ్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ వివరాలను కూడా వెబ్‌సైట్‌లో పెడుతున్నారు. ఇక వెబ్‌సైట్ పరిశీలిస్తే అందులో వీర రాఘవరెడ్డి వీడియోలన్నీ ప్రశాంతంగా కనిపిస్తాయి. కానీ, బాలాజీ ఆలయ అర్చకుడిపై దాడి సందర్భంగా కోపం, ఆంగ్రహంతో ఊగిపోయారు. అందుకు కారణం. ఇక్కడికి యువత ఎక్కువగా రావడం, ఆ వివరాలు ఇవ్వడానికి అర్చకుడు నిరాకరించడం ఆయనకు కోపం తెప్పించింది. ఇక వీర రాఘవరెడ్డిపై 2015లోనే హైదరాబాద్ అబిడ్స్ (Abids)పోలీస్ స్టేసన్‌లో కేసు నమోదైంది. రామరాజ్యం పేరుతో తనకు ప్రత్యేక చట్టం ఉందని ఆయన సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాడు. దీనిని గుర్తించి కేసు నమోదు చేశారు.
ఏదైనా చేయవచ్చా..
ఇదిలా ఉంటే.. రామరాజ్యం స్థాపన ముసుగులో ఏదైనా చేయవచ్చా అన్న చర్చ జరుగుతోంది. వీర రాఘవరెడ్డి తాను శూద్రడిగా చెప్పుకున్నారు. కానీ, ఆయన వివరాలు తెలియలేదు. అయితే రామరాజ్యం ముసుగులో ఆయన చేస్తున్న కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రైవేటు ఆర్మీని రిక్రూట్ చేయడం, దాడులకు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే ప్రాణాలు తీయాలని, చివరకు చావడానికి కూడా వెనుకాడొద్దని ఆయన చెప్పే మాటలే ఆందోళన కలిగిస్తున్నాయి. ఉగ్రవాలు, వావోయిస్టుల ఏరివేత చేపడుతున్న పోలీసులు ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది.