Tandel : అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ చిత్రం ‘తండేల్'(Thandel Movie) తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ వసూళ్లతో ముందుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటిరోజు ఆడియన్స్ నుండి ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. కానీ దేవిశ్రీప్రసాద్ అందించిన అద్భుతమైన సంగీతం, నాగ చైతన్య ఎమోషనల్ నటన, కచ్చితంగా థియేటర్స్ లో చూస్తేనే కిక్ వస్తుంది అనే టాక్ రివ్యూయర్స్ ఎక్కువగా చెప్పడంతో ఈ సినిమాకి ఓపెనింగ్ వసూళ్లు దుమ్ము లేపేసాయి. నైజాం వంటి ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని కేవలం మూడు రోజుల్లోనే దాటేసింది ఈ చిత్రం. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా కష్టం గా అనిపిస్తుంది. వాటిల్లో ఓవర్సీస్ కూడా ఉంది. సోమవారం రోజున ఈ సినిమాకి కేవలం 22 వేల డాలర్లు మాత్రమే ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు ఈ చిత్రానికి నార్త్ అమెరికాలో 7 లక్షల డాలర్లు మాత్రమే వచ్చాయి.
బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఆ ప్రాంతం లో కనీసం 15 లక్షల డాలర్లు రాబట్టాలి. అది దాదాపుగా అసాధ్యం అని అంటున్నారు. అదే విధంగా ఆదివారం రోజు వచ్చిన వసూళ్లతో పోలిస్తే సోమవారం వచ్చిన వసూళ్లు దాదాపుగా 50 శాతం కి పైగా తగ్గింది. 50 శాతం కంటే తక్కువ ఉంటే మంచి హోల్డ్ ఉన్నట్టు, 50 శాతం కి పైగా డ్రాప్స్ అంటే కచ్చితంగా యావరేజ్ రేంజ్ అన్నట్టు. ఓపెనింగ్స్ టాక్ కి తగ్గట్టు లేకపోయినా, లాంగ్ రన్ మాత్రం టాక్ కి తగ్గట్టుగానే వసూళ్లు వస్తున్నాయి. వాలెంటైన్ డే వరకు ఈ చిత్రం కచ్చితంగా మంచి హోల్డ్ ని కనబర్చాలి, అప్పుడే వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకోగలదు. నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) నిన్నటి నుండి టికెట్ రేట్స్ అన్ని ప్రాంతాల్లో తగ్గించి మంచి పని చేశాడనే చెప్పాలి. లేకపోతే ఈ యావరేజ్ రేంజ్ లో కూడా హోల్డ్ ఉండేది కాదు.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం,నాల్గవ రోజు ఈ చిత్రానికి కేవలం మూడు నుండి నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. బుక్ మై షో లో దాదాపుగా 74 వేల టిక్కెట్లు నిన్నటి రోజున అమ్ముడుపోయాయట. ఇది యావరేజ్ రేంజ్ టికెట్ సేల్స్ అనొచ్చు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. దీంతో ‘తండేల్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజులకు కలిపి 35 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టిన సినిమాగా నిల్చింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇక కేవలం 5 కోట్లు మాత్రమే రావాల్సి ఉంది. రేపు, ఎల్లుండి లోపు బ్రేక్ ఈవెన్ మార్కుని ఈ చిత్రం అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఫుల్ రన్ లో ఎంత దూరం వెళ్లి ఆగుతుందో చూడాలి.