Power Bills: లిక్విడ్ పేమెంట్ కంటే డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ చేస్తున్నారు చాలా మంది. పట్టణాల్లో మాత్రమే కాదు ఈ వసతి గ్రామాల్లో ఇదే పెరిగిపోయింది. చిన్న అవసరం వచ్చినా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం అంటూ ఉపయోగిస్తున్నారు ప్రజలు. కిరాణ షాప్ కి వెళ్లినా సరే రూ 10 కోసం అయినా స్కానర్ ఉందా అని అడుగుతున్నారు. ఆన్ లైన్ పేమెంట్ లు పెరిగిన ఈ రోజుల్లో కరెంట్ బిల్ కూడా అదే తరహాలో పే చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఓ అలర్ట్ వచ్చింది. అదేంటంటే..
తెలంగాణ ప్రజలకు ఉచిత కరెంట్ ను ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. కానీ షరతులు వర్తిస్తున్నాయి. కేవలం 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించిన వారికి మాత్రమే ఈ గృహజ్యోతి పథకం వర్తిస్తుంది. ఆ పైన విద్యుత్ ను వినియోగించిన వారికి మాత్రం బిల్ వస్తుంది. ఇక ఇందులో చాలా మంది తమకు అనుగుణంగా కరెంట్ బిల్ ను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా చెల్లిస్తున్నారు. ఇలాంటి చెల్లింపులు చేసేవారికి కీలక విజ్ఞప్తి చేసింది టీజీఎస్‌పీడీసీఎల్.
ఫోన్‌పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా కరెంట్ బిల్ కట్టవద్దని ప్రజలను కోరింది. RBI ఆదేశాల ప్రకారం సర్వీస్ ప్రొవైడర్లైన ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే, బ్యాంకుల ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపులు నిలిపివేసింది. దీంతో ఈ రోజు నుంచి బిల్ ను పే చేయాలంటే TGSPDCL వెబ్సైట్/ మొబైల్ యాప్ ద్వారానే నెలవారీ కరెంట్ బిల్లులు చెల్లించాలి.