Kalki Movie: కల్కి క్లైమాక్స్ లో ఆ ట్విస్ట్ ప్రభాస్ సలహానా… అదిరిందిగా!

Kalki Movie: కల్కి క్లైమాక్స్ లో కురుక్షేత్ర యుద్దాన్ని రూపొందించాడు. హీరో విజయ్ దేవరకొండను అర్జునుడిగా చూపించాడు. ఇక అమితాబ్ బచ్చన్ యంగ్ అశ్వద్ధామగా యుద్ధం చేయడం మనం చూడొచ్చు.

Written By: S Reddy, Updated On : July 1, 2024 6:20 pm

Kalki Movie Climax Twist is Prabhas Suggestion

Follow us on

Kalki Movie: కల్కి 2829 AD అంచనాలకు మించి ఉందన్న వాదన వినిపిస్తుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తన టేకింగ్ తో మెస్మరైజ్ చేశాడు. దేశం మొత్తం అతని పేరు వినిపిస్తుంది. ఇదిలా ఉంటే కల్కి చిత్రం క్లైమాక్స్ లో వచ్చే ఓ కీలక ట్విస్ట్ దర్శకుడు నాగ్ అశ్విన్ కి ప్రభాస్ సూచించాడంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది. అదేమిటో చూద్దాం. నాగ్ అశ్విన్ ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీగా రూపొందించారు. కల్కి రాకను, మహాభారతాన్ని, అందులోని పాత్రలను స్ఫూర్తిగా తీసుకున్నాడు.

కల్కి క్లైమాక్స్ లో కురుక్షేత్ర యుద్దాన్ని రూపొందించాడు. హీరో విజయ్ దేవరకొండను అర్జునుడిగా చూపించాడు. ఇక అమితాబ్ బచ్చన్ యంగ్ అశ్వద్ధామగా యుద్ధం చేయడం మనం చూడొచ్చు. కాగా ప్రభాస్ ని సినిమా మొత్తం భైరవగా నాగ్ అశ్విన్ చూపించారు. ఈ భైరవ బౌంటీ హంటర్. కాంప్లెక్స్ అనే విలాసవంతమైన ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. భైరవ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో సాగుతుంది.

కల్కి క్లైమాక్స్ లో భైరవ పాత్రను కర్ణుడిగా చూపించారు. ఇది సినిమాకు హైలెట్ గా నిలిచింది. కాగా ఈ సూచన ప్రభాస్ చేశాడట. పార్ట్ 2లో దీన్ని రివీల్ చేయాలని దర్శకుడు అనుకున్నాడట. కానీ క్లైమాక్స్ లో భైరవ పాత్రకు ఈ ఎలివేషన్ బాగుంటుందని ప్రభాస్ చెప్పాడట. దాంతో నాగ్ అశ్విన్ క్లైమాక్స్ మార్చి రాశాడట. అది కల్కి సినిమాకు చాలా ప్లస్ అయ్యిందని అంటున్నారు.

మరోవైపు కల్కి వసూళ్ల దుమ్ముదులుపుతుంది. వీకెండ్ ముగిసే నాటికి రూ. 500 కోట్ల క్లబ్ లో చేరింది. నార్త్ అమెరికాలో కల్కి వసూళ్లు $11 మిలియన్ దాటేశాయి. ఆర్ ఆర్ ఆర్ రికార్డు కల్కి లేపేసింది. కెనడా దేశంలో హైయెస్ట్ వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా కల్కి రికార్డులకు ఎక్కింది. మొత్తంగా కల్కి చిత్రంతో ప్రభాస్ సరికొత్త రికార్డ్స్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.