Revanth indirect attack on KTR: తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప్పు నిప్పులా ఉంటున్నారు. ప్రతీ విషయానికి ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలకు బాధ్యుడిని చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డిపై కేటార్ విచుచుకుపడుతున్నాడు. ఇక రేవంత్‌రెడ్డి కూడా వీలు దొరికినప్పుడల్లా కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో వీరి మాటల యుద్ధం కామన్ అయింది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరు ఎత్తకుండా తిట్లదాడి చేశారు. ‘నేను పెద్ద పెద్ద ఇంగ్లీష్ చదువులు చదువుకోకపోయినా నాకు కామన్ సెన్స్ ఉంది. అమెరికాలో బిచ్చం ఎత్తుకునేటోడు కూడా ఇంగ్లీష్ వస్తుంది.. బాత్‌రూంలు కడిగేటోడు కూడా ఇంగ్లిష్ మాట్లాడగుతుడు కానీ కామన్‌సెన్స్ ఉండాలి కదా’ అంటూ కేటీఆర్‌ను టార్గెట్ చేశారు. అదే సమయంలో ‘జపాన్, చైనా, జర్మనీ వాళ్లకు ఇంగ్లీష్ రాకపోయినా ప్రపంచాన్ని శాసిస్తున్నారు‘ అని తెలిపారు.
నిత్యం రాజకీయ ఘర్షణలే..
రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య రాజకీయ ఘర్షణ కొత్తేమీ కాదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, బీఆర్‌ఎస్ నాయకత్వంపై రేవంత్ రెడ్డి విమర్శలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. కేటీఆర్ అమెరికాలో చదువుకుని ఉద్యోగం చేవాడు. కేటీఆర్ తరచూ ఆంగ్లంలో తన రాజకీయ వాదనలను వ్యక్తం చేస్తుంటారు. అందుకే రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ చదువులు, కామన్ సెన్స్ గురించి ప్రస్తావించడం ద్వారా, కేటీఆర్ విద్యా అర్హతలను, ఆయన రాజకీయ శైలిని ఎద్దేవా చేశారు.
Also Read: సొంత గూటికి కల్వకుంట్ల కవిత! ఇదిగో ప్రూఫ్
రేవంత్ రెడ్డి వ్యాఖ్యల ఉద్దేశం..
రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా కేటీఆర్‌ను వ్యక్తిగతంగా లక్ష్యం చేయడమే కాకుండా, తెలంగాణ ప్రజల్లో బీఆర్‌ఎస్‌పై వ్యతిరేక భావనను పెంచే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. కేటీఆర్‌ను ‘విదేశీ శైలి‘ నాయకుడిగా చిత్రీకరించి, సామాన్య ప్రజలతో దూరం చేసే రాజకీయ వ్యూహంగా దీనిని చూడవచ్చు. ఆయన విదేశీ చదువులన ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగించినట్లు కనిపిస్తుంది. తెలంగాణలోని గ్రామీణ ఓటర్లలో ఎక్కువ మంది సామాన్య జ్ఞానాన్ని, స్థానిక సమస్యలపై శ్రద్ధను ఎక్కువగా విలువైనవిగా భావిస్తారు. ఈ సందర్భంలో, రేవంత్ వ్యాఖ్యలు కేటీఆర్‌ను ‘అవగాహన లేని‘ నాయకుడిగా చూపించే ప్రయత్నంగా ఉన్నాయి. ఇక కేటీఆర్ స్పందన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను రాజకీయ డైవర్షన్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఇది రాజకీయంగా సున్నితమైన సమస్యల నుంచి దృష్టిని మరల్చే వ్యూహంగా ఉండవచ్చని ఆయన ఆరోపణలు సూచిస్తున్నాయి.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కేటీఆర్‌ను పరోక్షంగా లక్ష్యంగా చేసుకున్నాయని రాజకీయ విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత దాడి కంటే రాజకీయ వ్యూహంగా కనిపిస్తాయి, ఇవి బీఆర్‌ఎస్ నాయకత్వాన్ని బలహీనపరిచే లక్ష్యంతో చేసినట్లు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఘర్షణ రాజకీయ వేదికను ఎలా ప్రభావితం చేస్తుందనేది చూడాలి.
పెద్ద పెద్ద ఇంగ్లీష్ చదువులు చదువుకోకపోయినా నాకు కామన్ సెన్స్ ఉంది
అమెరికాలో బిచ్చం ఎత్తుకునే వాడికి కూడా ఇంగ్లీష్ వస్తుంది.. కానీ జపాన్, చైనా, జర్మనీ వాళ్లకు ఇంగ్లీష్ రాకపోయినా ప్రపంచాన్ని శాసిస్తున్నారు – రేవంత్ రెడ్డి pic.twitter.com/QnHycI6ffk
— Telugu Scribe (@TeluguScribe) August 15, 2025