New Virus Enters In Telangana: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వేగంగా రూపు మార్చుకుని పలు దఫాలుగా విజృంభిస్తూనే ఉంది. భారత్ ను కూడా కొవిడ్ అతలాకుతలం చేసింది. ప్రస్తుతానికి దేశంలో కొవిడ్ తీవ్రత తగ్గినా.. పూర్తిగా భయం మాత్రం పోలేదు. కొవిడ్ కల్లోలం కొనసాగుతుండగానే వెలుగులోనికి వచ్చిన మంకీ పాక్స్ ప్రపంచ దేశాలను కలవరపెట్టింది. పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.

ఐతే, ఇండియాలో కూడా మరో వైరస్ భయాందోళన కల్గిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. అతి భయంకరమైన వైరస్ తెలంగాణ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చిందనే వార్త ఇప్పుడు భయాన్ని రెట్టింపు చేస్తోంది. దీంతో రాష్ట్ర అధికారులు అలర్ట్ అయిపోయారు. ఇంతకీ ఆ వైరస్ ఏమిటో తెలుసా ?, లంపి వైరస్. పశువులకు అతి ప్రమాదకరమైన ఈ లంపి వైరస్ 1929లో మొదట జాంబియాలో వెలుగులోకి వచ్చింది.
ఈ లంపి వైరస్ పాలిచ్చే ఆవులు, గేదెలు, దూడలకు ఎక్కువగా అంటుకుంటుంది. ఇప్పటికే ఆఫ్రికా, ఆసియా, యూరోపియన్ దేశాలను వణికించిన ఈ వ్యాధి తాజాగా ఇండియాలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. నిజానికి ఈ వైరస్ విషయంలో భారత్ ఎంతో అప్రమత్తమైంది. దేశంలోని పలు చోట్ల అధికారులు ముందస్తు జాగ్రత్తలు కూడా చేపట్టారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఈ వైరస్ ఇండియాలోకి వచ్చింది. కారణం పాకిస్తాన్ అని తెలుస్తోంది.

పాకిస్తాన్ ద్వారా లంపి వైరస్ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చిందని అధికారులు భావిస్తున్నారు. హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరఖండ్ లలో కేసులను గుర్తించారు. ఈ వ్యాధి సోకితే పశువలతల, మెడ, కాళ్లు, పొడుగు, పునరుత్పత్తి అవయవాలపై చర్మసంబంధ గడ్డలు వస్తాయి. దీంతో పశువుల తోలు పనికిరాకుండా పోయి చనిపోతుంటాయి. లంపి స్కిన్ వైరస్ వ్యాధి సోకిన పశువును మంద నుంచి వెంటనే వేరు చేయాలి.