Animal Cruelty Case: రొటీన్ కి భిన్నంగా చేస్తేనే కొత్తగా ఉంటుంది. ఆ కొత్తదనం కోసం నేడు చాలామంది సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. అలాంటి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో లో మహిళ మాట్లాడిన మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. కాకపోతే ఆ మహిళ కోపంతో మాట్లాడింది. ఆమెకు కోపం ఎందుకు వచ్చింది? పోలీస్ స్టేషన్లో ఆమె ఎందుకు కనిపించింది? ఎవరి మీద ఆమె ఫిర్యాదు చేయడానికి వచ్చింది? ఆమెకు ఎదురైన అనుభవం ఎటువంటిది? అనే ప్రశ్నలకు సమాధాన రూపమే ఈ కథనం.
గ్రామాలలో నేటికీ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. అలాంటి నిబంధనలు అతిక్రమిస్తే గ్రామాలలో రచ్చ అవుతుంది. అలాంటి సంఘటన ఇది. ఈ ఘటనలో ఓ మహిళకు చెందిన కోడిని ఒక వ్యక్తి కొట్టాడు. దీంతో ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతేకాదు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది. పోలీస్ స్టేషన్ ఎదుట తన బాధను వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి తనకు ఎదురైన అనుభవాన్ని పోలీసుల ఎదుట వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఆమెలో ఆవేశం తగ్గలేదు. ఆగ్రహం చల్లారలేదు. కంటికి రెప్పలా పెంచుకుంటున్న కోడి.. కంటి పాపలా కాపాడుకుంటున్న కోడిని ఓ వ్యక్తి కొట్టడాన్ని ఆమె సహించలేకపోయింది. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి.. అతడికి శిక్ష పడాలని డిమాండ్ చేసింది.
Also Read: భర్తతో విడాకులంటూ ప్రచారం.. నయనతార రియాక్ట్ ఇదే
ఉమ్మడి నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో గొల్లగూడెం అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన గంగమ్మకు కోళ్లు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. పైగా ఆమె చాలా వరకు కోళ్లను పెంచుకుంటున్నది. ఈ క్రమంలో గంగమ్మ కోడి ఒకటి పక్కనే ఉన్న రాకేష్ అనే వ్యక్తికి చిన్న గడ్డివాము దగ్గరికి వెళ్ళింది. ఆ గడ్డివాములో వారు గింజలు ఆరబోశారు. ఆ గింజలను కోడి తిన్నది. తినడం మాత్రమే కాకుండా గడ్డివామును మొత్తం తవ్వింది. దీంతో రాకేష్ ఆగ్రహంతో ఊగిపోయాడు. తన గడ్డివామిని ఇలా చేస్తున్న కోడిపై కక్ష పెంచుకున్నాడు. అంతేకాదు రాయితో కోడిని కొట్టాడు. ఆ కోడి కాళ్లు విరిగిపోయాయి. కాలు విరిగిపోయి కోడి ఇబ్బంది పడుతుంటే గంగమ్మ చూడలేకపోయింది.
తన కోడిని కొట్టిన రాకేష్ పై బూతుల వర్షం కురిపించింది. అంతటితో ఆమె ఆగ్రహం ఆగలేదు. ఆమెలో ఆవేశం తగ్గలేదు. అదే కోపంతో కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ వెళ్లింది. పోలీస్ స్టేషన్ వెళ్లి పోలీసులకు తన బాధను వెల్లడించింది. తన కోడికి పడుతున్న ఇబ్బందిని పోలీసులతో చెప్పుకుంది. వెంటనే రాకేష్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు గంగమ్మకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. పైగా రాకేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ” ఎంతో ఇష్టపడి పెంచుకుంటున్న కోడిపై అతడు దాడి చేశాడు. కోడి కాళ్లు విరిగిపోయాయి. అది నడవలేని స్థితిలో ఉంది. దీనంతటికీ రాకేష్ కారణం. అతనిపై చర్యలు తీసుకోవాలి. అతని నుంచి నాకు నష్టపరిహారం ఇప్పించాలని” గంగమ్మ వాపోయింది. మరి దీనిపై నకిరేకల్ పోలీసులు ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది.
పోలీస్ స్టేషన్లో కోడి పంచాయితీ
కోడిని కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ
నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని గొల్లగూడెంలో తన గడ్డివాములో గింజలు తింటుందని, కర్రతో కొట్టి కోడి కాళ్లు విరగగొట్టిన రాకేష్ అనే వ్యక్తి
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన గంగమ్మ
పోలీసులు సర్దిచెప్పే… pic.twitter.com/I9MssgNZbh
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2025