https://oktelugu.com/

Farmer Politics: ఫార్మర్‌ పాలిటిక్స్‌.. సర్కార్‌ సైడ్‌ అవుతుందా?

కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకురావడంతో దీనిని రాజకీయం చేసి లబ్ధి పొందాలని కేసీఆర్‌ భావించారు. కానీ, కాళేశ్వరం కుంగిపోవడం, దక్షిణ తెలంగాణను పట్టించుకోకపోవడం అంశాలతో కేసీఆర్‌ ఆశించిన ఫలితం రాలేదు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 1, 2024 / 03:01 PM IST

    All parties have started farmer politics In Telangana

    Follow us on

    Farmer Politics: పార్లమెంటు ఎన్నికల ముందు.. తెలంగాణలో ఫార్మర్‌ పాలిటిక్స్‌కు అన్ని పార్టీలు తెరలేపాయి. లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 12 సీట్లు గెలవాలని అధికార కాంగ్రెస్‌ భావిస్తోంది. సర్వే సంస్థలు కూడా ఈమేరకు అంచనా వేశాయి. అయితే సీఎం రేవంత్‌ మాత్రం 14 స్థానాలు మావే అంటున్నారు. ఈ తరుణంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఫార్మర్‌ పాలిటిక్స్‌కు తెర తీశాయి. తెలంగాణలో ఇప్పటికే పంటలు ఎండిపోతున్నాయి. జలాశయాలు అండుగంటుతున్నాయి. తాగునీరు కూడా కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో ఈ అంశాలతోనే కేసీఆర్‌ రాజకీయం మొదలు పెట్టారు.

    కృష్ణా జలాల రాజకీయం ఫెయిల్‌..
    కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకురావడంతో దీనిని రాజకీయం చేసి లబ్ధి పొందాలని కేసీఆర్‌ భావించారు. కానీ, కాళేశ్వరం కుంగిపోవడం, దక్షిణ తెలంగాణను పట్టించుకోకపోవడం అంశాలతో కేసీఆర్‌ ఆశించిన ఫలితం రాలేదు. అది కాంగ్రెస్‌కే ప్లస్‌ అయింది. బీఆర్‌ఎస్‌ ఫెయిల్‌ అయింది. దీంతో కేసీఆర్‌ ఒకే సభ పెట్టి సైలెంట్‌ అయ్యాడు. ఈ క్రమంలో ఎంపీ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు చావో రేవో అన్నట్లుగా మారాయి. ఒక్క సీటుఅయినా గెలుస్తుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ మళ్లీ ఫాంహౌస్‌ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీ నుంచి సీనియర్‌ నాయకులు కేకే, కడియం లాంటి వాళ్లు కూడా పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాడర్‌లో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో క్యాడర్‌లో ఆత్మస్థైర్యం నింపేందుకు కేసీఆర్‌ బయటకు వచ్చారు.

    ఫార్మర్‌ ఫార్ములాతో..
    బయటకు రావడానికి కేసీఆర్‌ ఫార్మర్‌ ఫార్ములాను ఎత్తుకున్నారు. దానిని అమలు చేయడంలో భాగంగా రైతు పరామర్శ యాత్ర మొదలు పెట్టారు. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో పర్యటించారు. వారం తర్వాత కరీంనగర్‌లో పర్యటించాలని భావిస్తున్నారు. అక్కడ కూడా రైతులను పరామర్శించేల ప్లాన్‌ రెడీ చేసుకున్నారు.

    ‘బండి’ అలర్ట్‌..
    ఈ తరుణంలో కరీంనగర్‌ సిట్టింగ్‌ ఎంపీ బండి సంజయ్‌ అలర్ట్‌ అయ్యారు. కేసీఆర్‌ రైతుల అజెండాతో కరీంనగర్‌కు వస్తే తాను వెనుకబడి పోతానని భావించిన బండి కూడా అదే రైతు ఎజెండాతో దీక్షకు దిగాలని నిర్ణయించారు. ఈమేరకు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే కలెక్టరేట్‌ ఎదుట దీక్షకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో తన ఇంటి వద్దనే దీక్షకు సిద్ధమవుతున్నారు.

    బీఆర్‌ఎస్, బీజేపీలు రైతుల పేరుతో రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నా కాంగ్రెస్‌ సైలెంట్‌గా ఉండటంపై ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమైంది. కేసీఆర్‌ వాగ్ధాటికి, బండి సంజయ్‌ అటాకింగ్‌కు తగ్గట్లుగా కాంగ్రెస్‌ నుంచి కౌంటర్‌ పడలేదు. ఇదే కొనసాగితే కాంగ్రెస్‌ సైడ్‌ అవడం ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.