https://oktelugu.com/

Suma Adda: నైట్ డ్రెస్ లో యాంకర్ సుమ షోకి వచ్చిన స్టార్ సింగర్… ఇదేం అరాచకం బాబోయ్!

ఉగాది పండుగ సందర్భంగా ప్రముఖ సింగర్స్ .. మనో, రఘు కుంచె, కల్పన, మనీషా గెస్టులుగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఉగాది రోజున ట్రెడిషనల్ గా రమ్మని చెప్పారు.

Written By:
  • S Reddy
  • , Updated On : April 1, 2024 / 03:08 PM IST

    Star singer came to Anchor Suma show in night dress

    Follow us on

    Suma Adda: యాంకర్ సుమ కనకాల ఈటీవీలో ప్రసారం అవుతున్న సుమ అడ్డా షో హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి శనివారం సెలెబ్రెటీ గెస్టులు వచ్చి సందడి చేస్తుంటారు. ఇక సుమ చేసే కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమయస్ఫూర్తితో పంచులు వేస్తూ నవ్వులు పూయిస్తుంది. ఇక ఈసారి సుమ అడ్డాకు సింగర్స్ వచ్చారు. వాళ్లలో ఒక సింగర్ అనూహ్యంగా నైట్ డ్రెస్ లోనే షో కి రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఓ షోకి నైట్ డ్రెస్ వేసుకు రావడం ఏమిటీ? ఆ కథ ఏమిటో చూద్దాం…

    ఇక ఉగాది పండుగ సందర్భంగా ప్రముఖ సింగర్స్ .. మనో, రఘు కుంచె, కల్పన, మనీషా గెస్టులుగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఉగాది రోజున ట్రెడిషనల్ గా రమ్మని చెప్పారు. మరి ఆయనేంటి పూల చొక్కా వేసుకుని పూల రంగడులా వచ్చాడని, రఘు కుంచె… మనో ని ఉద్దేశిస్తూ మాట్లాడుతాడు. వెంటనే మనో స్టేజ్ మీదకు వచ్చి .. నాకు నైట్ టైం ఇట్లాంటి డ్రెస్ వేసుకుని పడుకోవడం అలవాటు అని చెప్తాడు.

    దీంతో సుమ… అంటే అది నైట్ డ్రెస్సా అని అంటుంది. దీంతో అంతా తెగ నవ్వుతారు. అలా సుమ, రఘు కుంచె కలిసి మనోను ఆటపట్టిస్తారు. ఆ తర్వాత మనో,కల్పన, సుమ, రఘు, మనీషా కలిసి ఒక ఎంటర్టైనింగ్ టాస్క్ ఆడతారు. మనో నాన్ స్టాప్ పంచులు వేస్తూ నవ్వించారు. ఆ తర్వాత రఘు కుంచె, మనో కలిసి ఓ పాటకు డాన్స్ చేశారు. తాజాగా విడుదలైన సుమ అడ్డా ప్రోమో వినోదం పంచింది.

    కాగా ఈ ఎపిసోడ్ శనివారం రాత్రి 9 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది. ఇందులో సుమ కు అదిరిపోయే పంచులు పడ్డాయి. అందరి పై సెటైర్లు వేస్తూ ఉండే సుమకు .. మనో రివర్స్ పంచులు వేశాడు. టెన్త్ క్లాస్ ఐదు సార్లు ఫెయిల్ అయ్యానని మనో చెప్పాడు. ఎక్కడ చదువుకున్నారు అని సుమ అడగ్గా .. విజయవాడ లో చదివానని .. వారంలో ఒక్క రోజే స్కూల్ కి వెళ్ళేవాడిని అని చెప్పుకొచ్చాడు. కాగా మనో కామెంట్లు చాలా ఫన్నీగా అనిపిస్తున్నాయి.