https://oktelugu.com/

Ration Card : రేషన్ కార్డులు ఉన్న వారికి అలర్ట్.. ఈ తేదీలోపే ఈకేవైసీ

పెళ్లి అయితే భర్త ఉన్న రేషన్ కార్డులో పేరు నమోదు చేయించుకోండి. లేదంటే మీరే కొత్త రేషన్ కార్డును అప్లే చేసుకోండి.

Written By:
  • NARESH
  • , Updated On : June 12, 2024 / 11:06 PM IST

    Ration Cards

    Follow us on

    Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే ఈ వార్త మీకోసమే. కచ్చితంగా తెలుసుకోవాలి. రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీని చేయించుకోవాలి. లేదా రేషన్ కార్డు రద్దు అవుతుందట. అయితే కార్డు ఉన్న వారు కోల్పోతే మాత్రం పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. అందుకే రేషన్ కార్డు కలిగిన వారు ఇకేవైసీ చేయించుకోవాల్సిందే. రేషన్ కార్డులో ఉన్న అందరి పేర్లతో ఇకేవైసీని తప్పనిసరి. ఎవరైతే కేవైసీ చేయించుకోరో.. వారి పేరు రేషన్ కార్డు నుంచి తొలిగిపోతుంది. ఈ సారి డీలర్ వద్దకు వెళ్లినప్పుడు ఈకేవైసీ చేయించుకోండి.

    దీనికి సంబంధించి ప్రభుత్వం ఎప్పటి నుంచో అప్డేట్ ఇస్తూనే ఉంది. ప్రస్తుతం కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం రేషన్ కార్డులో నమోదు చేసుకున్న ప్రతి సభ్యుడు ఇ-కెవైసి పొందడం తప్పనిసరి. ఈకేవైసీ చేయించుకోకపోతే సరైన ధరలకు రేషన్ పొందలేరు. కొన్ని రాష్ట్రాల్లో రేషన్ కార్డులను ఆధార్ ప్రామాణికంగా జారీ చేస్తున్నారు. ఆధార్, బర్త్ సర్టిఫికెట్ ఉంటే ఇకేవైసీ ద్వారా రేషన్ కార్డు అందిస్తున్నారు. ఒకేసారి ఇకేవైసీ పూర్తి అయితే చాలు. ఇక ఇదే ప్రాసెస్ ఏపీలో కూడా ఉంది.

    తెలంగాణలో మాత్రం రేషన్ దుకాణాల వద్దకు ఇకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని రాష్ట్రాలలో రేషన్ కార్డు ఇకేవైసీకి జూన్ 30 వరకు గడువు పెంచారు. ఈ తేదీలలోపే ఈకేవైసీని పూర్తి చేయాలనే నిబంధనలను పెట్టారు అధికారులు. అయితే ఇకేవైసీ వల్ల రేషన్ కార్డులో నమోదైన సభ్యుల బయోమెట్రిక్స్ కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎవరైతే వేలి ముద్రలు వేయరో వారి పేరు రేషన్ కార్డు నుంచి తొలిగిపోతుంది. మరణించినా వివాహం చేసుకున్నా రేషన్ కార్డులో వీరి పేరు ఇకనుంచి రేషన్ కార్డులో ఉండదు.

    పెళ్లైతే కొత్త రేషన్ కార్డులో పేరును నమోదు చేసుకోవాలి. లేదంటే కొత్త దంపతులు కొత్త రేషన్ కార్డు పొందొచ్చు. మొత్తం మీద మీకు రేష్ కార్డు ఉంటే ఒకే లేదంటే ఈకేవైసీ చేయించుకోండి. పెళ్లి అయితే భర్త ఉన్న రేషన్ కార్డులో పేరు నమోదు చేయించుకోండి. లేదంటే మీరే కొత్త రేషన్ కార్డును అప్లే చేసుకోండి.