Ind vs USA : ఒరాకిల్ ఇంజనీర్ చేతిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కి భంగపాటు

పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సూపర్ ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి.. ఆకట్టుకున్న సౌరభ్.. భారత్ తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రోహిత్ వికెట్లు తీసి మరోసారి తాను వెరీ స్పెషల్ అని నిరూపించుకున్నాడు.

Written By: NARESH, Updated On : June 12, 2024 11:01 pm

Ind vs USA : Oracle Engineer Saurabh Netrawalkar Bowling Rohit Sharma, Virat Kohli Out

Follow us on

Ind vs USA : టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ అమెరికా చేతిలో ఓడిపోయింది గుర్తుంది కదా. సూపర్ ఓవర్ కు దారి తీసిన ఆ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టును 13 పరుగులకే కట్టడి చేసి.. అమెరికాను గెలిపించాడు. ఆ బౌలర్ పేరు సౌరభ్ నేత్రావల్కర్.. ఇతర ఆడుతోంది అమెరికా జట్టుకే అయినప్పటికీ.. ఇతడు భారత మూలాలు ఉన్న క్రీడాకారుడు. పాకిస్తాన్ మీదే కాదు.. భారత జట్టుతో న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్ లోనూ మెరిశాడు. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (4), విరాట్ కోహ్లీ (0) ని అవుట్ చేసి సత్తా చాటాడు. వెంట వెంటనే ఇద్దరు ఓపెనర్లను అవుట్ చేసి అదరగొట్టాడు.. ఇంతకీ సౌరభ్ నేపథ్యం ఏంటంటే..

సౌరభ్ 16 అక్టోబర్ 1991లో ముంబైలో జన్మించాడు. దేశవాళి క్రికెట్లో చాలాకాలం ఆడాడు. 2010 అండర్ -19 వరల్డ్ కప్ లో భారత జట్టు తరుపున ఆడాడు. మయాంక్ అగర్వాల్, సందీప్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి వారు సౌరభ్ కు సహచరులుగా ఉన్నారు. టీమిండియా తరఫున దేశవాళి క్రికెట్ లో సౌరభ్ చాలా కాలం ఆడాడు. 2015లో భారత జాతీయ జట్టులో అవకాశం రాకపోవడంతో అమెరికా వెళ్లాడు.. అక్కడ తన చదువుపై ఫోకస్ పెట్టాడు. 2016లో కార్నెల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ అందుకున్నాడు.. ఆ తర్వాత ఒరాకిల్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశాడు. అమెరికా జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఆ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. అంతకుముందు సౌరభ్ గల్ఫ్ జెయింట్స్, గయానా అమెజాన్ వారియర్స్ జట్లకు ఆడాడు. ఇక 2009 అండర్ -19 వరల్డ్ కప్ లో భారత జట్టు తరుపున ఆడి… టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. అయితే ఆ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై భారత్ ఓడిపోయింది. ఆ ఓటమికి టి20 వరల్డ్ కప్ లో సౌరభ్ ప్రతీకారం తీర్చుకున్నాడు. 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక భారత జట్టుతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను వెంట వెంటనే అవుట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ సౌరభ్ బౌలింగ్లో గోల్డెన్ డక్ గా అవుట్ కావడం విశేషం.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సౌరభ్ బౌలింగ్లో కనీసం బంతిని టచ్ చేసేందుకు కూడా ఇబ్బంది పడ్డారు. న్యూయార్క్ లాంటి స్లో పిచ్ పై సౌరభ్ బుల్లెట్ లాంటి బంతులు వేసి ఆకట్టుకున్నాడు.. అందువల్లే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపోయారు.. సౌరభ్ వేసిన బంతులను కాచుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు.. టీమిండియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను వెంట వెంటనే అవుట్ చేసి సౌరభ్ నేత్రావల్కర్ ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తయ్యాడు. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సూపర్ ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి.. ఆకట్టుకున్న సౌరభ్.. భారత్ తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రోహిత్ వికెట్లు తీసి మరోసారి తాను వెరీ స్పెషల్ అని నిరూపించుకున్నాడు.