Adani Foundation :  తెలంగాణ స్కిల్ వర్సిటీకి అదాని 100 కోట్లు ఎందుకు ఇచ్చాడు.. ఏంటా కథ?

భారత కుబేరుల్లో అంబానీ మొదటి స్థానంలో ఉండగా, అదాని తర్వాతి స్థానంలో ఉన్నారు. అనేక వ్యాపారాలు చేస్తున్న అదానీ గ్రూప్‌ సంస్థ సేవాభావంలోనూ ముందు ఉంటుంది. ఇటీవ ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాలు ప్రభావితమయ్యాయి. వరద బాధితుల కోసం అదానీ ఫౌండేషన్‌ రూ.25 కోట్లు విరాళంగా అందించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్కిల్‌ యూనివర్సిటీకి తాజాగా రూ.100 కోట్లు విరాళంగా ఇచ్చింది.

Written By: Raj Shekar, Updated On : October 18, 2024 8:48 pm

Adani Foundation

Follow us on

Adani Foundation :  భారత దిగ్గజ పారిశ్రామికవేత్తల్లో భారత దేశంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అదినేత ముకేష్‌ అంబానీ మొదటి స్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానంలో గౌతమ్‌ అదానీ ఉన్నారు. ఇటీవల ఏపీలో వరద బాధితులకు రూ.25 కోట్లు విరాళంగా ఇచ్చిన అదానీ, మరోమారు తన గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏరా‍్పటు చేసు‍్తన్న యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీకి భారీ విరాళం ప్రకటించారు. అందానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఫౌండేషన్‌ ద్వారా రూ.100 కోట్లు విరాళం ఇచ్చారు. ఈమేరకు చెక్కును తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి శుక్రవారం హైదరాబాద్‌లో అందజేశారు. ఇందులో అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, అదానీ ఫౌండేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని సీఎంవో సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. సీఎంకు చెక్కు అందించే ఫొటోలను షేర్‌ చేసింది. సడెన్‌గా అదానీ ఆర్థికసాయంపై ఇప్పుడు తెలంగాణలో చర్చ జరుగుతోంది.

ఊరికే ఇచ్చారా..
వరద బాధితులకు కేవలం రూ.25 కోట్లు ఇచ్చి ఇచ్చిన బడా పారిశ్రామికవేత్త అదానీ.. తెలంగాణలో ఇంకా ఏర్పాటు కాని యూనివర్సిటీకి ఉత్త పుణ్యానికే రూ.100 కోటు‍్ల విరాళం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి చడీ చప్పుడు లేకుండా తెలంగాణ సీఎం ఆఫీస్‌లో ప్రత్యక్షమైన అదానీ రూ.100 కోట్లు చెక్కు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందా అని ఆలోచన చేస్తున్నారు. దీనిపై పొలిటికల్‌ ఎనలిస్టులు స్పందిస్తున్నారు. దేశంలో ఉత్తరభారత దేశంలోని తనకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాల నుంచి రాయితీ పొంది వ్యాపారం చేస్తున‍్న అదానీ, తెలంగాణలోనూ తన వ్యాపారం విస్తరించడమే లక్ష్యంగా వ్యూహరచన చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఢిల్లీలో సీఎం రేవంత్‌ను కలిశారు. సీఎం కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు.. అదానీకి సీఎం నుంచే ఆహ్వానం రావడంతో ఉత్త చేతులతో వెళితే ఏం బాగుంటుందని అనుకున్నారు. ఈ క్రమంలోనే రూ.100 కోట్ల చెక్కుతో హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యారని తెలుస్తోంది.

సీఎంవో పోస్టు ఇలా..
సోషల్‌ మీడియాలో సీఎంవో చేసిన పోస్టు ఇలా ఉంది. ‘అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ ఫౌండేషన​ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌లో కలిశారు. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ కోసం రూ.100 కోట్ల చెక్కు అందజేశారు. యువతలో నైపుణ్యాభివృద్ధికి తెలగాణ ప్రభుత్వం ప్రారంభించిన గొప్ప ప్రయత్నానికి తమ మద్దతు ఉంటుందని అదానీ హామీ ఇచ్చారు’ అని తెలిపింది. ఈ కార్యక్రమంలో సీఎస్‌ శాంతికుమారి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.