Salman Khan : పోలీస్ భద్రతతో సల్మాన్ ఖాన్ ‘బిగ్ బాస్’ ఎపిసోడ్స్ షూటింగ్..స్పాట్ లో హై అలెర్ట్!

నేడు ఆయన భారీ భద్రతతో షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టి, షూటింగ్ ని పూర్తి చేసాడు. కానీ సెట్స్ చుట్టూ చాలా పటిష్టమైన భద్రతని ఏర్పాటు చేసారు. బయట వారిని లోపలకు రానివ్వడం లేదు, బిగ్ బాస్ టీం కి సంబంధించిన వాళ్ళు కూడా పూర్తి స్థాయి తనిఖీలు చేసిన తర్వాతనే లోపలకు అడుగుపెట్టాలి. అలా ప్రోటోకాల్స్ మధ్య సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్ ని పూర్తి చేసారు.

Written By: Vicky, Updated On : October 18, 2024 7:38 pm

Salman Khan

Follow us on

Salman Khan : హిందీ బిగ్ బాస్ షో కి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేసే విషయం అందరికీ తెలిసిందే. గత 17 సంవత్సరాలు గా 17 సీజన్స్ కి ఆయన హోస్ట్ గా వ్యవహరించాడు. ఇప్పుడు 18 వ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే ప్రారంభమైన ఈ సీజన్ కి అదిరిపోయే రేంజ్ లో టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్నాయి. అయితే ఈ సీజన్ నుండి సల్మాన్ ఖాన్ వైదొలుగుతున్నదని గత కొద్దిరోజుల నుండి సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కారణం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి వచ్చిన బెదిరింపులు. రెండేళ్ల నుండి సల్మాన్ కి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి బెదిరింపులు వస్తున్నాయి. రెండు మూడు సార్లు సల్మాన్ పై హత్యాయత్నం కూడా జరిగింది. అప్పటి నుండి సల్మాన్ ఖాన్ పూర్తి స్థాయి సెక్యూరిటీ తో బయటకు వస్తున్నాడు. రీసెంట్ గా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సల్మాన్ ఖాన్ కి మళ్ళీ బెదింపులు వచ్చాయి. జరుగుతున్న గొడవలన్నీ ఆగాలంటే 5 కోట్ల రూపాయిలు చెల్లించాల్సిందిగా సల్మాన్ ఖాన్ ని డిమాండ్ చేసారు.

ఇది ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో భారీ సెక్యూరిటీ సల్మాన్ కి ఏర్పాటు చేసారు. వీకెండ్ ఎపిసోడ్స్ షూటింగ్ కి సల్మాన్ ఖాన్ రాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ నేడు ఆయన భారీ భద్రతతో షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టి, షూటింగ్ ని పూర్తి చేసాడు. కానీ సెట్స్ చుట్టూ చాలా పటిష్టమైన భద్రతని ఏర్పాటు చేసారు. బయట వారిని లోపలకు రానివ్వడం లేదు, బిగ్ బాస్ టీం కి సంబంధించిన వాళ్ళు కూడా పూర్తి స్థాయి తనిఖీలు చేసిన తర్వాతనే లోపలకు అడుగుపెట్టాలి. అలా ప్రోటోకాల్స్ మధ్య సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్ ని పూర్తి చేసారు. అసలు ఈ వివాదం ఎందుకు మొదలైందో ఒకసారి చూద్దాం. 1998 వ సంవత్సరం లో సల్మాన్ ఖాన్ ఒక సినిమా షూటింగ్ విరామ సమయంలో కృష్ణ జింకలను వేటాడాడు. దీనిపై కోర్టులో కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది.

అయితే ఆ అడవి లో ఉన్నటువంటి బిష్ణోయ్ తెగకు చెందిన ప్రజలు, కృష్ణ జింక ని ఒక దేవుడిలాగా భావిస్తారు. అలాంటిది సల్మాన్ ఖాన్ వాటినే వేటాడడంతో లారెన్స్ అనే కుర్రాడు సల్మాన్ ఖాన్ పై పగ పెంచుకున్నాడు. ఈ విచారమైన ఘటన జరిగిన సమయానికి అతని వయస్సు కేవలం 5 ఏళ్ళు మాత్రమే. చిన్న తనం నుండి పగతో రగిపోతూ పెరిగిన లారెన్స్ బిష్ణోయ్, పెద్దయ్యాక తన గ్యాంగ్ తో సల్మాన్ ఖాన్ ని చంపేందుకు అనేక రకమైన పథకాలను రచిస్తూ వచ్చాడు. అప్పటి నుండి సల్మాన్ ఖాన్ భద్రతా సిబ్బంది సరద్రంలోనే అడుగులు వేస్తున్నాడు. ఈ గండం నుండి సల్మాన్ ఖాన్ శాశ్వతంగా ఎప్పుడు తప్పించుకొని బయటపడుతాడో చూడాలి.