ACP Vasundhara Yadav: తెలంగాణ కుంభమేళా, ఆసియాలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం మస్మక్క–సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. జనవరి 28న ప్రారంభమైన జాతర జనవరి 31 వరకు కొనసాగుతుంది. సమ్మక్క, సారలమ్మను గిరిజన పూజారులు గద్దెలపైకి తీసుకురావడంతో కీలక ఘట్టాలు పూర్తయ్యాయి. అడవి తల్లులను దర్శించుకునేందుకు లక్షల మంది జనం మేడారం బాటపట్టారు. ఇదిలా ఉంటే ఈసారి మేడారం జాతరలో ఓ లేడీ ఐపీఎస్ అధికారి స్పెషల్ ఎట్రాక్షగా నిలిచారు. జాతర విధుల్లో ఉన్న ఆమె ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌వుతున్నాయి.
కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్..
ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీగా ఉన్న వసుంధర యాదవ్, యూపీ నేపథ్యం కలిగిన తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి. మేడారం జాతరలో భద్రతా ఏర్పాట్లకు నాయకత్వం వహిస్తున్నారు. సమ్మక్క రాక సందర్భంగా జిల్లా ఎస్పీతో కలిసి కార్యక్రమానికి ఉత్సవ స్ఫూర్తిని జోడించారు.
వైరల్ మూమెంట్స్…
సమ్మక్క రాక సమయంలో తుపాకీతో గాల్లో కాల్పులు జరిపిన సమయంలో ఆమె కేరింతలు, సారలమ్మ గద్దెల వద్ద మంత్రి సీతక్కతో కలిసి ఆమె చేసిన స్టెప్పులు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్లిప్స్ లక్షలాది వ్యూస్ సాధించాయి. వసుంధర యాదవ్ ఉత్సాహం, చురుకుదనం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
నెటిజన్ల ప్రశంస..
వసుంధర యాదవ్ చురుకుదనం, విధినిర్వహణలో నిష్ట, క్రమశిక్షణ, ఉత్సాహం చూపి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సాధారణ పోలీస్ విధులకు అతీతంగా జాతర స్ఫూర్తిలో పాలుపంచుకోవడం అరుదు. దీని వల్ల ఆమె ‘స్పెషల్ అట్రాక్షన్‘గా నిలిచి, మహిళా అధికారులకు ఆదర్శంగా మారారు. ఈ ట్రెండ్ భద్రతా బలగాలకు కూడా సానుకూల ఇమేజ్‌ను పెంచుతోంది.