HomeతెలంగాణPrincipal Salutes The Feet Of The Student: విద్యార్థుల కాళ్లకు ప్రిన్సిపాల్ నమస్కారం.. అసలు...

Principal Salutes The Feet Of The Student: విద్యార్థుల కాళ్లకు ప్రిన్సిపాల్ నమస్కారం.. అసలు జరిగిందేమిటంటే?

Principal Salutes The Feet Of The Student: సాధారణంగా ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు విద్యార్థులు నమస్కారం చేస్తారు. కానీ దురద్రుష్టం అక్కడ మాత్రం విద్యార్థులకు కాలేజీ ప్రిన్సిపాల్ అయిన మహిళ నమస్కారం చేయాల్సి వచ్చంది. కాళ్లకు నమస్కారం పెట్టాల్సి వచ్చంది. దీనికి కారణం వారి కోపాన్ని తగ్గించడానికేనని తెలుస్తుండడం బాధాకరం. వయసులో పెద్ద, అందులోనూ ఒక మహిళా అధ్యాపకురాలు అంతగా వేడుకుంటున్నా సదరు విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు.ప్రస్తుతం అందకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? విద్యార్థి కాళ్లు పట్టుకుని క్షమించమనేంత పెద్ద తప్పు ఆమె ఏం చేసింది? నెటిజన్లు కోపానికి కారణం ఏంటనే పూర్తి వివరాలను ఓ సారి పరిశీలిస్తే..అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలో ఓ విద్యార్థిని మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో సదరు విద్యార్థిని హాజరుశాతం తక్కువగా ఉందనే విషయం అధ్యాపకుల దృష్టికి వచ్చింది. దీంతో ఆమెను హెచ్చరించారు. అయితే ఆ విషయాన్ని విద్యార్థిని స్థానిక ఏబీవీపీ నాయకుల ద్రుష్టికి తీసుకెళ్లింది. అంతే విద్యార్థినికే ఇబ్బందిపెడతారా? అంటూ స్థానిక ఏబీవీపీ నాయకుడు అక్షత్ జైస్వాల్ తెగ రెచ్చిపోయాడు.

Principal Salutes The Feet Of The Student
ABVP Leader Allegedly Forced Principal To Touch The Feet Of The Student

Also Read: AP Government Debits: కుప్పలు తెప్పలుగా అప్పు..మరో రూ.2000 కోట్ల రుణానికి ఏపీ సర్కారు ప్రయత్నం

సదరు విద్యార్థిని వెంట పెట్టుకుని నేరుగా కాలేజీ ప్రిన్సిపాల్ కార్యాలయానికి జైస్వాల్ వెళ్లాడు. అనంతరం ప్రిన్సిపల్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో సదరు మహిళా ప్రిన్సిపల్.. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వాళ్లు వెనక్కి తప్పగకపోవడంతో.. చేతులు జోడించి మరీ సదరు విద్యార్థిని క్షమాపణలు కోరారు. అంతేకాకుండా కాళ్లకు కూడా నమస్కారం చేశారు. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అవుతోంది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. ఏబీవీపీ ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు. దీంతో జరిగిన దానికి క్షమాపణలు కోరుతూ స్థానిక ఏబీవీపీ నాయకులు ప్రకటన విడుదల చేశారు.

Also Read: Sarkaru Vaari Paata 3 Days Collections: ‘ సర్కారు వారి పాట’ 3 డేస్ కలెక్షన్లు.. ఇబ్బంది పడుతున్న మహేష్

బిందు మాధవి సక్సెస్‌ సీక్రెట్స్‌ ఇదే..! || Bindu Madhavi Success Secrete || Big Boss Non Stop

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version