HomeతెలంగాణAndhra Jyothi Vs Sakshi: సాక్షి ని టార్గెట్ చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. అదే జరిగితే...

Andhra Jyothi Vs Sakshi: సాక్షి ని టార్గెట్ చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. అదే జరిగితే ఛానల్ మూత తప్పదా..

Andhra Jyothi Vs Sakshi: సాక్షి ఛానల్ కోర్టు స్టే తో నెట్టుకు వస్తోంది. ఇది చాలామందికి తెలియదు.. ఈ విషయాన్ని వ్యూహాత్మకంగా ఏబీఎన్ బయటపెట్టింది. అంతేకాదు ఇటీవల తన ట్యాగ్ లైన్ లు ఉపయోగించి వ్యూ ఇయర్ షిప్ పొందిందని.. తనకు దక్కాల్సిన వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నదని ఆరోపిస్తున్నది. అంతేకాదు తన పత్రికలో సాక్షి తీరుపట్ల భారీగానే కథనాలను ప్రచురించింది. ఇప్పుడు అందరితోనే ఆగడం లేదు ఏకంగా సాక్షి టీవీ లైసెన్స్ రద్దు చేయించడానికి వ్యూహాత్మకంగా ఏబీఎన్ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సాక్షిపై ఏబీఎన్ రకరకాల ఆరోపణలు చేసింది. కేసులు కూడా పెట్టింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు సో సోదాహరణంగా ఫిర్యాదు చేసింది. సాక్షి ఛానల్ నిబంధనలు ఎలా ఉల్లంఘిస్తోందో వివరాలతో సహా ఫిర్యాదు చేసింది. ఆ ఛానల్ కు కేంద్ర హోంశాఖ అనుమతులు లేవని ఏబీఎన్ ఆరోపిస్తోంది. అంతేకాదు గతంలో తాను ఇచ్చిన నోటీసులను కూడా తాజా ఫిర్యాదుకు ఏబీఎన్ జత చేసింది. కేంద్ర హోం శాఖ గతంలోనే సాక్షి ఛానల్ లైసెన్స్ రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే దానికి సంబంధించిన నోటీసులను సాక్షి ఛానల్ యాజమాన్యం తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. కేంద్ర హోంశాఖ తదుపరి చర్యలు తీసుకోకుండా స్టే తెచ్చుకుంది. ప్రస్తుతం స్టే మీదనే సాక్షి ఛానల్ నిర్వహిస్తోంది. అయితే ఈ విషయాన్ని ఏబీఎన్ తవ్వితీస్తోంది.. అంతేకాదు ఇప్పుడు ఏకంగా కీలక ఆరోపణలు చేసి.. మరింతగా సాక్షి ఛానల్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తోంది అనే విషయంపై సాక్షి ఛానల్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ కేసు నమోదయింది. ఈ కేసును కూడా కేంద్ర సమాచార ప్రచార శాఖ దృష్టికి ఏబీఎన్ తీసుకెళ్లింది.

రద్దవుతుందా?

ఏబీఎన్ దూకుడు చూస్తుంటే సాక్షి లైసెన్స్ పూర్తిగా రద్దు చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఏబీఎన్ కోరుకున్నట్టుగా ఒక న్యూస్ ఛానల్ లైసెన్స్ రద్దు చేయడం అంత సులువు కాదు.. ఒకవేళ ఆ ఛానల్ దేశ రక్షణకు ఆటంకం కలిగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టరు. ఇప్పుడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది. బిజెపికి టిడిపి మద్దతు కీలకంగా ఉంది. టిడిపిని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడుకి రాధాకృష్ణ అత్యంత సన్నిహితుడు. పైగా కేంద్ర ప్రభుత్వంలో రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ వంటి టిడిపి మంత్రులు రాధాకృష్ణకు అత్యంత సన్నిహితులు. అలాంటప్పుడు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో ఏదైనా చేసేంత సామర్థ్యం ప్రస్తుతం రాధాకృష్ణకు దఖలు పడింది. అలాంటప్పుడు సాక్షి ఛానల్ లైసెన్స్ రద్దు కావడాన్ని కొట్టిపారేయలేమని మీడియా విశ్లేషకులు అంటున్నారు. మరి గతంలో బిజెపి పెద్దలతో జగన్ సన్నిహిత సంబంధాలు నడిపాడు. ఇప్పుడు కూడా అంతగా గ్యాప్ ఉన్నట్టు లేదు. అలాంటప్పుడు జగన్ ఛానల్ లైసెన్స్ రద్దు చేయడంలో కేంద్ర పెద్దలు అంత ఉత్సాహం చూపిస్తారా? లేకుంటే గతంలో మాదిరిగానే వ్యవహరిస్తారా? అనే ప్రశ్నలకు కాలం గడిస్తే గాని సమాధానం లభించే పరిస్థితి లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular