June 30 Important: జూన్‌ 30 లోపు ఈ మూడు పనులు తప్పక చేయండి!

ప్రస్తుత జూన్‌ 30వ తేదీలోపు చేయాల్సిన మూడు ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Written By: Raj Shekar, Updated On : June 13, 2024 11:24 am

June 30 Important

Follow us on

June 30 Important: ఏడాదిలో ప్రతీ నెలకు ఒక ప్రాధాన్యం ఉంటుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి, లేదా వ్యక్తగత విషయాలకు సంబంధించి చేయాల్సిన పనులు ఉంటాయి. ప్రస్తుత జూన్‌ 30వ తేదీలోపు చేయాల్సిన మూడు ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

– ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నవారైతే.. కంపెనీ నుంచి జూన్‌ 15 లోపే ఫాం – 16 తీసుకోవాలి. ఎందుకంటే ఫాం – 16లో ఈజీగా ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేసుకోవచ్చు. ఈ ఫాం – 16లో మన మొత్తం ఆదాయం. ఇన్వెస్ట్‌మెంట్‌ డిడక్షన్స్, టీడీఎస్‌ డిడక్షన్స్‌ వివరాలు ఉంటాయి.

– ఇక రెండో పని మీ మ్యూచువల్‌ ఫండ్స్‌కి నామినీని ఆయడ్‌ చేయాలి. జూన్‌ 30లోపు ఇది చేయకుంటే జూలై 1 నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌ మొత్తం ప్రీజ్‌ అవుతాయి. ఈ ఫండ్స్‌లోకొత్తగా ఇన్వెస్ట్‌ చేయలేదు. ఇప్పటికే చేసి ఉంటే.. వాటిని విత్‌డ్రా కూడా చేసుకోలేరు. అందుకే తప్పనిసరిగా నామినీని యాడ్‌ చేయండి.

– మీరు ఆధార్‌ తీసుకుని పదేళ్లు అయితే.. తప్పనిసరిగా అప్‌డేట్‌ చేసుకోవాలి. అప్‌డేట్‌ ఉచితంగా చేయడానికి ప్రభుత్వం జూన్‌ 14 వరకు అవకాశం కల్పించింది. తర్వాత అప్‌డేట్‌ చేసుకోవాలంటే చార్జి చెల్లించాల్సి ఉంటుంది. అప్‌డేట్‌ చేయని ఆధార్‌ చెల్లుబాటు అయ్యే అవకాశాలు తగ్గుతాయి.