Women’s Park: మహిళల కోసం హైదరాబాద్ లో ఓ ప్రత్యేక పార్క్.. ఆ పార్టీలూ చేసుకోవచ్చట!

Women’s Park: ‘ఆడవాళ్లు వంటింటి కుందేళ్లు’.. ఆడవాళ్లు ఇంట్లో నుంచి బయటకు రాకూడదు.. ఉద్యోగాలు, గట్రా చేయకూడదు.. అప్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో ఇప్పటికీ మహిళలు బయటకు రాలేని పరిస్థితి. ఇప్పటికే చాలా దేశాల్లో మహిళలపై ఆంక్షలున్నాయి. కానీ మన దేశంలో మాత్రం మహిళలు మహారాణుల వలే స్వేచ్ఛగా జీవిస్తున్నారు. మన ప్రజాస్వామ్యంలో వారికి కావాల్సినంతగా విహరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో అయితే మహిళల కోసం ఒక ప్రత్యేక పార్క్ కూడా ఏర్పాటు చేయడం సంచలనమైంది. తెలంగాణ రాష్ట్రంలో […]

Written By: NARESH, Updated On : June 7, 2022 9:53 pm
Follow us on

Women’s Park: ‘ఆడవాళ్లు వంటింటి కుందేళ్లు’.. ఆడవాళ్లు ఇంట్లో నుంచి బయటకు రాకూడదు.. ఉద్యోగాలు, గట్రా చేయకూడదు.. అప్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో ఇప్పటికీ మహిళలు బయటకు రాలేని పరిస్థితి. ఇప్పటికే చాలా దేశాల్లో మహిళలపై ఆంక్షలున్నాయి. కానీ మన దేశంలో మాత్రం మహిళలు మహారాణుల వలే స్వేచ్ఛగా జీవిస్తున్నారు. మన ప్రజాస్వామ్యంలో వారికి కావాల్సినంతగా విహరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో అయితే మహిళల కోసం ఒక ప్రత్యేక పార్క్ కూడా ఏర్పాటు చేయడం సంచలనమైంది.

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు ప్రథమ ప్రాధాన్యమిస్తూ మొట్టమొదటి సారిగా కేపీహెచ్బీలో కేవలం మహిళల కోసమే పార్క్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ పార్క్ ను ఆదివారం ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ లు కలిసి ప్రారంభించారు.

కేసీఆర్, కేటీఆర్ చొరవతో మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నారు. వారి సాధికారిత కోసం పాటు పడుతున్నారు. వారి చొరవతోనే ఇక్కడ మహిళల కోసం ఇక్కడ మహిళా పార్క్ ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు.

ఇక ఈ పార్క్ లో మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. మహిళలతోపాటు 10 ఏళ్లలోపు చిన్నారులకు మాత్రమే ఇందులోకి ఎంట్రీ ఉంది. దీని నిర్వహణతోపాటు ఇతర అంశాల్లోనూ కేవలం మహిళలు మాత్రమే ఉంటారు.

దేశంలో, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఇటువంటి పార్కులు లేవు. కేవలం తెలంగాణలో మాత్రమే వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే తెలంగాణలో షీటీంలు, మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలోనే మహిళల కోసం ప్రభుత్వం ఏకంగా పార్క్ ఏర్పాటు చేయడం విశేషం.

ఇక ఈ పార్క్ మహిళల కిట్టీ పార్టీలు.. మహిళల సమావేశాలకు ప్రత్యేకంగా కేటాయించారు. ఇందులో మహిళలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఇలా వారి కోసం సకల సదుపాయాలతో దీన్ని ఏర్పాటు చేయడంపై మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది.

Tags