https://oktelugu.com/

Tollywood Star Director: హైదరాబాదులో ఓ సీక్రెట్ కాపురం.. జతకట్టిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. స్టార్ హీరోయిన్ కథ

సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. అందచందాలు ఉంటే ఈ రంగంలో రాణిస్తారని నానుడి. దీంతో కొందరు అమ్మాయిలు కాస్త అందంగా ఉంటే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఆరాటపడుతుంటారు. చిత్ర పరిశ్రమలో అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 13, 2024 4:38 pm
    Tollywood star director secret kapuram

    Tollywood star director secret kapuram

    Follow us on

    Tollywood Star Director: సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. అందచందాలు ఉంటే ఈ రంగంలో రాణిస్తారని నానుడి. దీంతో కొందరు అమ్మాయిలు కాస్త అందంగా ఉంటే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఆరాటపడుతుంటారు. చిత్ర పరిశ్రమలో అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. ఆ విషయం ఇప్పటికే వివిధ సినిమాల ద్వారా అర్థమైపోయింది. అయితే సినిమాల్లో అవకాశాలు ఉండాలంటే ఏం చేయాలో అదే చేస్తున్నారు కొందరు హీరోయిన్లు.. ఒకప్పుడు సినిమాల్లో అవకాశం రావడం గగనంగా ఉండేది. కానీ ఇప్పుడు అవకాశం వచ్చినా.. ఆ తరువాత సినిమాలు దొరకడం కష్టంగా మారింది. ఈ తరుణంలో ఓ హీరోయిన్ తనకు అవకాశాలు రావాలని ఏం చేసిందో తెలుసా?

    సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ లేదా హీరో లేదా ప్రొడ్యూసర్.. ఇలా ఎవరో ఒకరితో చనువుగా ఉంటారన్న వార్తలు ఇప్పటికే బయటకు వచ్చాయి. కొందరు ‘మీ టూ’ ద్వారా తమనే వేధించారని సోషల్ మీడియా ద్వారా చెప్పారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం సినిమాల్లో అవకాశాల కోసం ఓ డైరెక్టర్ తో రిలేషన్ షిప్ కొనసాగిస్తోందని సమాచారం. సదరు హీరోయిన్ ఆ డైరెక్టర్ తో కలిసి ఉండడం వల్ల కొన్ని సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయన్న చర్చ సాగుతంది. ఈ ఏడాదితో ఓ డిజాస్టర్ సినిమా తీసిన ఆ డైరెక్టర్ భార్య ప్రస్తుతం విదేశాలకు వెళ్లింది. దీంతో ఆయన ఓ హీరోయిన్ కు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చనువుగా ఉంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

    అయితే ఈ చనువు ఆ హీరోయిన్ కు కలిసి వచ్చిందని తెలుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఓ మూడు సినిమాల్లో ఆమె మెరిసింది. అందుకు కారణం ఆ డైరెక్టర్ పుణ్యమేనని అంటున్నారు. ఈ సంవత్సరం అయితే ఎలాగో గడిచింది. మరి వచ్చే ఏడాది సంగతి ఏంటి? అని కొందరు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆ హీరోయిన్ సినిమాల్లో అవకాశాల కోసం ఇలాంటి పనులు చేయడంపై కొందరు వ్యతిరేకిస్తుండగా.. బతుకు దెరువు కోసం తప్పదు గురూ.. అని మరికొందరు సపోర్టు చేస్తున్నారు. అయితే ఇద్దరి ఇష్టంతోని ఎవురు ఏం చేసినా పట్టించుకోరు. కానీ ఆ తరువాత తమకు అన్యాయం జరిగిందని రోడ్డుపై పడితే ఇండస్ట్రీకే మచ్చ వస్తుందని కొందరు సీక్రెట్ గా చర్చించుకుంటున్నారు.

    మిగతా ఇండస్ట్రీల్లో కంటే ఈ రంగంలో ఇలాంటి విషయాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. గతంలోనూ ఇలాంటివి జరిగాయని కొందరు లోలోపల చర్చించుకుంటుండగా.. కొందరు సోషల్ మీడియా ద్వారా బయటపెట్టి రచ్చ చేశారు. ఇటీవల మలయాళ ఇండస్ట్రీలో అయితే సినిమాల్లో అవకాశాల కోసం డైరెక్టర్లు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసింద. కొందరు టాలీవుడ్ లోనూ దీనిపై చర్చించాలని పట్టుబడుతున్నారు. కానీ కొందరు తాము సినిమాల్లో కొనసాగాలంటే ఇలాంటివి తప్పవనే భావనతో ఉన్నారు. ఒకవేళ మలయాళ ఇండస్ట్రీలో లాగా కమిషన్ వేస్తే మాత్రం ఉన్న అవకాశాలు పోతాయనే భయం కొందరిలో ఉంది. దీంతో టాలీవుడ్ నుంచి ఎవరూ బయటకు రావడం లేదు.