https://oktelugu.com/

Parents Don’t Beat Children: పిల్లలు బాగా చదవాలంటే తల్లిదండ్రులు కొట్టడం కాదు.. ఇలా చేయండి..

ప్రస్తుతం అంతా టెక్నాలజీమయం అవుతోంది. భవిష్యత్ లో ఇది మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇప్పుడున్న విద్యార్థులు పోటీపడి బాగా చదివితేనే భవిష్యత్ లో వారు రాణించగలుగుతారు. అయితే ఒకప్ప్పుడు మినిమం ఎడ్యుకేషన్ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు ప్రాక్టికల్ చదువులు కావాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 13, 2024 / 04:01 PM IST

    Parents don't beat children

    Follow us on

    Parents Don’t Beat Children: ప్రస్తుతం అంతా టెక్నాలజీమయం అవుతోంది. భవిష్యత్ లో ఇది మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇప్పుడున్న విద్యార్థులు పోటీపడి బాగా చదివితేనే భవిష్యత్ లో వారు రాణించగలుగుతారు. అయితే ఒకప్ప్పుడు మినిమం ఎడ్యుకేషన్ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు ప్రాక్టికల్ చదువులు కావాలి. దీంతో నేటి విద్యార్థులు చదువులో బాగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఈ నేపథ్యంలో అటు ఉపాధ్యాయులు, ఇటు తల్లిదండ్రులు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. పిల్లలు చదువుకోవాలనుకోవడం మంచి ఆలోచనే. కానీ వారిని రకరకాలుగా ఇబ్బంది పెట్టడం వల్ల ఇష్టంగా చదువుకోలేరు. ముఖ్యంగా చదువును వారు ఒత్తిడిగా భావిస్తే ఇందులో రాణించలేదు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు చదవకపోవడంవల్ల వారిపై చేయి చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల తల్లిదండ్రులపై వారికి చెడు అభిప్రాయం కలుగుతుంది. మరి పిల్లలు ఇష్టంగా చదవాలంటే ఏం చేయాలి? ఎలాంటి టిప్స్ పాటించాలి?

    పిల్లలు చదువులో రాణించాలంటే పాఠశాలల్లో మాత్రమే చదివితే సరిపోదు.ఇంటి వద్ద కూడా కూడా చదువుకు సంబంధించిన ఎక్సర్ సైజ్ చేస్తూ ఉండాలి. ఇందుకోసం తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వారికి అండగా ఉండాలి. కుదరకపోతే ట్యూషన్ల ద్వారా అదనంగా చదువును అందించాలి. అయితే చాలా మంది పిల్లలు చదువును భారంగా ఫీలవుతారు. పాఠశాలల్లోనే వారు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొని ఇంటి వద్దకు రాగానే మళ్లీ చదువు అంటే బాధపడుతారు. అయితే పిల్లలు ఇష్టంగా చదవాలంటా తల్లిదండ్రులు కొన్ని విషయాలు పాటించాలి.

    పాఠశాలల నుంచి పిల్లలు ఇంటికి రాగానే వెంటనేవారికి హోం వర్క్ అని ఇబ్బందికి గురి చేయొద్దు. కనీసం ఒక గంట పాటు వారిని ఆడుకోనివ్వాలి. ఇది ఫిజికల్ గా అయితే మరీ మంచిది. నేటి కాలంలో పిల్లలు మొబైల్ తోనే ఎక్కువగా రిలాక్స్ అవుతారు. అయితే ఇందులో గేమింగ్ వైపు వారిని మరల్చాలి. వారు ఎటువంటి గేమ్స్ ఆడితే ఉల్లాసంగా ఉంటారో వాటిని ఆడుకోనివ్వాలి. ఇలా గంట సేపు వారు రిలాక్స్ అవనివ్వాలి. ఆ తరువాత వారికి ఇష్టమైన స్నాక్స్ అందించాలి. రిలాక్స్ అయిన తరువాత ఏదైనా తినడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది.

    ఆ తరువాత వారిని హోం వర్క్ వైపు తీసుకెళ్లాలి. కొంత మంది పిల్లలకు పాఠశాలలో చెప్పే విషయాలు అర్థం కావు. వీటి గురించి వారు బాధపడుతారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ సందేహాన్ని తీర్చాలి. ఒకవేళ వీలుకాకపోతే పాఠశాలకు వెళ్లి మరోసారి చెప్పమని ఉపాధ్యాయులను కోరాలి. ఇలా చేయడం వల్ల వారు ఎటువంటి డౌట్స్ అయినా తల్లిదండ్రుల వద్ద షేర్ చేసుకొని పరిష్కరించుకుంటారు. దీంతో వారికి చదువు పెద్దగా ఇబ్బంది అనిపించదు.

    విద్యార్థులు తమకు కేటాయించిన హోం వర్క్ ను పూర్తి చేయడానికి తగిన సమయం ఇవ్వాలి. వెంటనే పూర్తి చేయాలని ఒత్తిడి చేయడంతో వారు ఆందోళన చెందుతారు. దీంతో అయోమయానికి గురైన అసలు విషయం అర్థం కాదు. కొందరు విద్యార్థులు కొన్నింటిపై బాగా ఇంట్రెస్ట్ ఉంటంది. ముఖ్యంగా మొబైల్ లోని గేమ్స్ ఆడడానికి వారు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తే ముందుగా హోం వర్క్ పూర్తి చేసిన తరువాత ఆడుకోవడానికి అవకాశం ఇస్తామనని వారికి ఆఫర్స్ ఇస్తూ ఉండాలి. దీంతో వారు తమ పనిని ఇష్టంగా పూర్తి చేస్తారు.