Gas Cylinder Leak: ఈ ప్రపంచంలో ప్రాణం కంటే విలువైనది ఏదీ కాదు. అలాంటి ప్రాణం పోతుందని ముందే తెలిస్తే ఆ భయం చెప్పలేనిది. ఎవరైనా చావు కల్లెదుట కనిపిస్తే ఆ పరిస్థితి తట్టుకోలేకుండా ఉంటుంది. దీంతో ప్రాణం కాపాడుకోవడానికి వీలైనంత జాగ్రత్త పడుతూ ఉంటారు. బయటికి వెళ్లినప్పుడు ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఏ తప్పు చేయకుండా ఆ ప్రమాదంలో బలైన వారి సంఘటనలూ చూశాం. అందువల్ల ప్రమాదం ముంచుకొస్తుందని తెలిస్తే జాగ్రత్తపడడం ఉత్తమం. హైదరాబాద్ లో జరిగిన సంఘటనలో ఇలా చాలా మంది జాగ్రత్తపడి తమ ప్రాణాలను నిలుపుకున్నారు. ఈ క్రమంలో జనం తమ వాహనాలను అక్కడే వదిలేని పారిపోయారు. అదృష్టవశాత్తూ అ ప్రమాదం కూడా జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఏంజరిగిందంటే?
హైదరాబాద్ పాతబస్తీలోని సంతోష్ నగర్- చాంద్రాయణ గుట్ట ప్రధాన రహదారిపై సిలిండర్లుతో ఉన్నబుధవారం ఓ ఆటో వెళ్తోంది. మార్గ మధ్యలో ఓ సిలిండ్ నుంచి గ్యాస్ లీక్ అయింది. ఇది గమనించిన ఆటో డ్రైవర్ ఆటోను పక్కకు పారిపోయాడు. ఆ తరువాత అటువైపు వెళ్తున్న కొందరు గమనించి తమ వాహనాలను ఎక్కడికక్కడే వదిలేసి దూరంగా వెళ్లిపోయారు. దీంతో వాహనాల నిలుపుతో చాంద్రాయణ గుట్ట రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. బోయన్ పల్లి నుంచి గగన్ పహాడ్ లో డెలివరీ చేయడానికి ఈ ఆటో 12 సిలిండర్లతో వెళ్తోంది.
ఈ సమాచారం తెలుసుకున్న ఫలక్ నుమా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే అక్కడున్న వాహనదారులను దూరంగా పంపించారు. అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి ఫైరింజన్ ను తెప్పించారు. ముందుగా ఆటోలోని సిలిండర్లను కిందికి దింపారు. ఆ తరువాత జాగ్రత్తగా సిలిండర్ నుంచి లీకయిన గ్యాస్ ను సరి చేశారు. దీంతో ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమయానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడంతో పెద్ద ప్రమాదే తప్పింది.
ఆ తరువాత వాహన దారులు తమ వాహనాలను తీసుకొని వెళ్లారు. అయితే ఈ సంఘటన నివాసాలు ఎక్కువగా లేని ప్రాంతంలో జరగడంతో ఎటువంటి సమస్య రాలేదు. అదే జన సమూహాల్లో అయితే భారీ నష్టం ఉండే అవకాశం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే ఇలాంటి సందర్భంగాల్లో చాకచక్యంగా వ్యవహరిస్తే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని పోలీసులు అక్కడున్న వారికి అవగాహన కలిగించారు.