https://oktelugu.com/

Modi Cabinet 2024: కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నుంచి ఇద్దరికి ఛాన్స్‌… పీఎంవో నుంచి ఫోన్‌ కాల్స్‌!

కేంద్ర క్యాబినెట్‌లోకి తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం దక్కినట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కిషన్‌రెడ్డి, కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కు కొత్త క్యాబినెట్‌లో అవకాశం దక్కినట్లు తెలిసింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 9, 2024 12:09 pm
    Modi Cabinet 2024

    Modi Cabinet 2024

    Follow us on

    Modi Cabinet 2024: నరేంద్రమోదీ సారథ్యంలో కేంద్రంలో మూడోసారి కొలువుదీరబోయే కొత్త ప్రభుత్వ మంత్రి వర్గం కూర్పు కొలిక్కి వచ్చింది. కేబినెట్‌లో ఛాన్స్‌ దక్కే ఎంపీలకు ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో)నుంచి ఫోన్‌ కాల్స్‌ వెళ్తున్నాయి. కాసేపట్లో వీరికి ప్రధాని మోదీ తన నివాసంలో తేనేటి విందు ఇవ్వనున్నట్లు సమాచాం.

    తెలంగాణ నుంచి వీరికి అవకాశం..
    కేంద్ర క్యాబినెట్‌లోకి తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం దక్కినట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కిషన్‌రెడ్డి, కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కు కొత్త క్యాబినెట్‌లో అవకాశం దక్కినట్లు తెలిసింది. వీరికి పీఎంవో నుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఇద్దరూ ఒకే కారులో బయల్దేరి ప్రధాని నివాసానికి వెళ్లినట్లు సమాచారం. ఆదివారం(జూన్‌ 9) సాయంత్రం ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

    ఏపీ నుంచి ఇద్దరికి..
    ఇక ఏపీ నుంచి కూడా కేంద్ర క్యాబినెట్‌లో ఇద్దరికి ఛాన్స్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది టీడీపీ ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు పీఎంవో నుంచి కాల్స్‌ వెళ్లినట్లు సమాచారం. మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి కేంద్ర కాబినెట్‌లో స్థానం దక్కినట్లు తెలుస్తోంది.

    మిత్రపక్షాలకు పదవులు..
    ఎన్డీఏ మిత్రపక్షాల ఎంపీల్లో కుమారస్వామి (జేడీఎస్‌), ప్రతాప్‌రావ్‌ జాదవ్, చిరాగ్‌ పాశ్వాన్, అజిత్, ప్రఫుల్‌ పటేల్‌(ఎన్‌సీపీ), జేడీయూ నుంచి లలన్‌సింగ్, రామ్‌నాథ్‌ఠాకూర్, అప్నాదల్‌ నుంచి అనుప్రియా పాటిల్‌కు ఫోన్‌ కాల్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ నుంచి సీనియర్‌ నాయకులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్‌గడ్కరీ, పీయూష్‌ గోయల్, జితేంద్రసింగ్, శర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, జేపీ నడ్డా, అమిత్‌షా, మేఘ్‌వాల్, హర్‌దీప్‌పూరి, కేరళ నుంచి గెలిచిన ఎంపీ సురేశ్‌గోపికి సైతం ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్లు సమాచారం.