తల్లిదండ్రులు పిల్లల పెంపకం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా పిల్లల ప్రాణాలకే అపాయం కలిగే అవకాశం ఉంటుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. దీపం 17 నెలల చిన్నారి ప్రాణాలు పోవడానికి కారణమైంది. అదిలాబాద్ జిల్లా తాంసీలో చోటు చేసుకున్న ఈ ఘటన వల్ల స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
పూర్తి వివరాల్లోకి వెళితే జిల్లాలోని తాంసీ గ్రామంలో శ్రీకాంత్, పల్లవి దంపతులు జీవించేవాళ్లు. వీళ్లకు శ్రావణి అనేక పాప ఉంది. పల్లవి పూజా కార్యక్రమాల్లో భాగంగా ఇంట్లోని తులసి గద్దె వద్ద ఒక దీపాన్ని వెలిగించింది. అయితే ప్రమాదవశాత్తూ ఆ దీపం గౌనుకు అంటుకోవడంతో పాప మంటల్లో చిక్కుకుంది. అదే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పాప శరీరం పూర్తిగా కాలిపోయింది.
Also Read: దుబ్బాక: టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ అభ్యర్థి.. అది ఫేక్ న్యూస్ అంట..!
ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఇంటి ఆవరణలో నుంచి పాప ఇంట్లోకి రాకపోవడంతో బయటకు వెళ్లి చూశారు.అప్పటికే మంటల్లో పాపను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే పాపను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించగా మార్గమధ్యంలోనే పాప చనిపోయింది. చిన్నపాటి నిర్లక్ష్యం పాప ప్రాణాలు పోవడానికి కారణమైంది. చిన్నారి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read: నామా’కు నామాలు.. టీఆర్ఎస్ లో డమ్మీ అయ్యారా?
అల్లారుముద్దుగా పెంచుకున్న పాప మరణంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొద్దిపాటి నిర్లక్ష్యం తమ కుటుంబంలో విషాదం నింపిందని వాపోతున్నారు.